రాబోయే ఎన్నికల్లో విజయకేతనం ఎగరేస్తాం

దేవినేని అవినాష్‌
 

విజయవాడ: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయవాడ నగరంలో విజయకేతనం ఎగరవేస్తామని వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు దేవినేని అవినాష్‌ అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు బుధవారం మంత్రులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్‌ మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వ హయాంలో వైయస్‌ఆర్‌సీపీ కార్పోరేటర్లు ఉన్న డివిజన్లను అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చూపారని మండిపడ్డారు. మా ప్రభుత్వం అన్ని ప్రాంతాలకు సమాన ప్రాధాన్యం ఇస్తూ నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తుందన్నారు. కృష్ణలంక కరకట్ట నిర్మాణానికి రూ.125 కోట్లు కేటాయించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. రాబోయే కార్పోరేషన్‌ ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గంలో అన్ని డివిజన్లలో విజయకేతనం ఎగురవేస్తామన్నారు. బొప్పన భవకుమార్‌ మాట్లాడుతూ.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల మీదుగా మంచినీటి పైప్‌లైన్‌కు శంకుస్థాపన చేయడం శుభపరిణామమన్నారు. ఆర్భాటాలు టీడీపీ సొంతమైతే.. అన్ని ప్రాంతాల అభివృద్ధి మా నైజమన్నారు.
 

Back to Top