బాబూ..ఎన్నికల ముందు మీరు ఇచ్చిన వాగ్దానం గుర్తుచేస్తున్నా..

క‌రెంటు చార్జీల పెంపుపై వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ట్వీట్‌

తాడేప‌ల్లి:  రాబోయే ఐదు సంవ‌త్స‌రాల్లో క‌రెంటు చార్జీలు పెంచ‌న‌ని పులివెందుల ఎన్నిక‌ల ప్ర‌చారంలో చంద్ర‌బాబు ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గుర్తు చేశారు. ఈ మేర‌కు పులివెందుల‌లో చంద్ర‌బాబు 02.08.2023న చేసిన ప్ర‌సంగం వీడియోను వైయ‌స్ జ‌గ‌న్ త‌న ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.

https://x.com/ysjagan/status/1850741914938822977

టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే విద్యుత్‌ చార్జీలు తగ్గించేవాళ్లం అని గతంలో చెప్పిన మీరు.. ఇప్పుడు ప్రజలు ఎంతగా వద్దని వేడుకున్నా వినిపించుకోకుండా రూ.6,072.86 కోట్ల భారం వేయడం భావ్యమేనా? ఎన్నికల ముందు అధికారం కోసం ఇచ్చిన హామీ మేరకు ఈ చార్జీలను ప్రభుత్వమే భరించాలని వినియో­గదారులు చేసిన విజ్ఞప్తులను ఎందుకు పెడచెవిన పెట్టారు? ప్రజలపై అదనపు చార్జీల భారం వేయడమే మీ విజనా?’ అంటూ చంద్ర­బాబుపై వైయ‌స్ జ‌గ‌న్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మీరు తప్పు చేసి మాపై నిందలా?
⇒ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఐదు నెలల్లోపే వినియో­గదారులపై ఎఫ్‌పీసీసీఏ చార్జీల భారం రూ.6,072.86 కోట్లు మోపింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలను సిగ్గు లేకుండా వదిలేసి ఎఫ్‌పీసీసీఏ చార్జీల పేరిట వసూలు చేస్తున్నప్పటికీ.. అవి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కార్యకలాపాలకు సంబంధించిన చార్జీలంటూ మా ప్రభుత్వంపై నిందలు మోపడానికి ప్రయత్నించడం ఎంత వరకు సమంజసం? ప్రభుత్వమే ఈ చార్జీలు భరించాలని, ప్రజలపై వేయడానికి వీల్లేదని ఏపీఈఆర్సీ విచారణలో పాల్గొన్న వివిధ వర్గాల ప్రజలు కోరారు. వారం రోజులపాటు ప్రభుత్వ స్పందన కోసం ఏపీఈఆర్సీ ఎదురు చూసినా కూటమి ప్రభుత్వం చార్జీలు భరించేందుకు ముందుకు రాలేదంటే అర్థం ఏమిటి? ఎన్నికలప్పుడు ఇచ్చిన వాగ్దానానికి అర్థమేమిటి బాబూ?

⇒ ప్రజలపై చార్జీల భారం వేయా­లన్నదే మీ ఉద్దేశమని ఇక్కడ స్పష్టమైంది. గతంలోనూ ఇలా­గే చార్జీలు పెంచి, ఇదేమి న్యా­యం అని అడిగిన ప్రజలను బషీర్‌బాగ్‌లో గుర్రాలతో తొక్కించి.. తుపాకీలతో కా­ల్పిం­చి చంపించిన చరిత్ర మీదే. ఇప్పటికైనా విద్యుత్‌ చార్జీల భారం వేయాలన్న మీ కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. లేదంటే ప్రజలు క్షమించరు. వైఎస్సార్‌­సీపీ చూస్తూ ఊరుకోదు.

ఆ రోజే డిస్కంలను అప్పులపాలు చేశారు
⇒ గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే విద్యుత్‌ రంగాన్ని నాశనం చేశారు. అనవసర విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల కార­ణంగా డిస్కంలను అప్పుల­పాలు చేశారు. అవ­సరం లేకపో­యినా పవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌(పీపీఏ)­లను అధిక ధర­లకు కుదుర్చు­కు­న్నారు. దాదాపు 8 వేల మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల వల్ల విద్యుత్‌ సంస్థలపై 25 ఏళ్లపాటు ఏటా అదనంగా రూ.3,500 కోట్ల భారం పడుతోంది.

⇒ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2015–16లో 76 యూనిట్ల విద్యుత్‌ వినియోగిస్తే రూ.140.10 బిల్లు వచ్చేది. 2018–19కి వచ్చే సరికి ఇదే వినియోగానికి వచ్చిన బిల్లు రూ.197.60. అంటే 41.04 శాతం పెరిగింది. 2016–18లో 78 యూనిట్లకు రూ.145.30 నుంచి రూ.202.80 అంటే 39.57 శాతం, 80 యూనిట్లకు రూ.150.50 నుంచి రూ.208 అంటే రూ.38.21 శాతం పెంచేశారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా, విద్యుత్‌ చార్జీల విషయంలో, విద్యుత్‌ రంగం విషయంలో ఇలాంటి కుట్రలే చేస్తుంటారని మరోసారి ప్రజలకు అర్థమయ్యేలా చేశారు.

⇒ 2014–19లో చంద్రబాబు సీఎంగా ఉండగా.. విద్యుత్‌ శాఖను అసమర్థంగా నిర్వహించిన కారణంగా డిస్కంలకు సంచిత నష్టాలు రూ.22,089 కోట్లు వచ్చాయి. అప్పటికే ఉన్న రూ.6,625 కోట్ల నష్టాలతో కలుపుకుని మొత్తంగా రూ.28,715 కోట్లకు నష్టాలు పెరిగాయి. డిస్కంల సంచిత నష్టాలు 4.35 శాతం రెట్లు పెరిగాయి. ప్రభుత్వ యాజమాన్యంలోని విద్యుత్‌ రంగ సంస్థలపై అప్పులతోపాటు బకాయిల భారం 2014లో రూ.29,552 కోట్లు ఉండగా, అది 2019లో రూ.86,215 కోట్లకు చేరింది.

⇒ టీడీపీ ప్రభుత్వం కాలానుగుణంగా ట్రూ అప్‌ పిటిషన్లను ఏపీఈఆర్‌సీకి దాఖలు చేయాలి. కానీ అలా చేయలేదు. అందువల్ల వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు టీడీపీ సర్కార్‌ హయాం నాటి ట్రూ అప్‌ పిటిషన్లు పెండింగ్‌లో ఉండిపోయాయి. అయితే ఆ భారాన్ని విని­యో­గదారులపై పూర్తిగా మోపకుండా అతి తక్కువ భారం పడేలా చేసింది. అయితే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ట్రూఅప్, ఎఫ్‌పీసీసీఏ తదితర కొత్త పేర్లతో ప్రజలపై భారం మోపి కష్టాల­పాలు చేస్తోందంటూ అప్పటి ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేనలు నానా రాద్ధాంతం చేశాయి.

Back to Top