గ్యాంగ్ రేప్ బాధితురాలికి వైయ‌స్ఆర్‌సీపీ అండ‌

 
శ్రీ‌కాకుళం జిల్లా:  శ్రీకాకుళం జిల్లా పలాసలో గ్యాంగ్ రేప్ బాధితురాలి కుటుంబానికి  వైయస్‌ఆర్‌సీపీ అండ‌గా నిలిచింది. బాధిత కుటుంబాన్ని మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు పరామర్శించి.. భరోసా ఇచ్చారు.

కాశీబుగ్గ మున్సిపాలిటీకి చెందిన ముగ్గురు బాలురులో ఒకరి పుట్టిన రోజు కావడంతో ఈ నెల 19న వారు ముగ్గురు బాలికలతో బయటకు వెళ్లారు. ఈ ముగ్గురు బాలికల్లో ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. 19న రాత్రి ఈ ఆరుగురు కలిసి పలాస సినిమా థియేటర్‌ సమీపంలో బిర్యానీలు, కేక్‌లు, గిఫ్ట్‌లు, మద్యం పట్టుకుని బైక్‌లపై జంట పట్టణాలను దాటి వెళ్లారు. పట్టణానికి దూరంగామనుషుల అలికిడి లేని ప్రాంతానికి చేరుకుని పుట్టిన రోజు వేడుక చేసుకున్నారు. కేక్‌ కటింగ్‌ చేసి మద్యం సేవించినట్లు సమాచారం. ఆ సమయంలో అక్కాచెల్లెళ్లపై ఇద్దరు బాలురు లైంగికదాడికి పాల్పడ్డారు. 

మరో బాలికతోనూ చనువుగా ప్రవర్తించడానికి ప్రయత్నించగా ఆమె ప్రతిఘటించింది. లైంగికదాడిని వీడియో రికార్డు చేసుకున్నారు. అదే రోజు రాత్రి పదకొండు గంటల సమయంలో అందరూ ఇళ్లకు చేరుకున్నా రు. ఆదివారం ఉదయం మూడో బాలిక తన తల్లిదండ్రుల వద్ద ఈ వ్యవహారాన్ని బయటపెట్టింది. మిగతా ఇద్దరు బాలికల తల్లిదండ్రులకు కూడా విషయం తెలియడంతో వారు పరువు పోతుందని మిన్నకుండిపోయారు. 

అక్కాచెల్లెళ్లలో ఒక అమ్మా యి అనారోగ్యానికి గురి కావడం, సోమవారానికి కూడా స్పృహలోకి రాకపోవడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. ఈ కేసులో రాజీ కోసం టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

Back to Top