ఆ భూమి ఎక్క‌డుందో చూపిస్తే పేద‌ల‌కు పంచుతా..

నారా లోకేష్‌కు వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే నంబూరు శంక‌ర్‌రావు స‌వాల్‌

గుంటూరు: ``నేను 400 ఎకరాలు అటవీ భూమి ఆక్రమించుకుని వెంచరేశానని లోకేష్ ఆరోపిస్తున్నాడు..  దమ్ముంటే ఆ ల్యాండ్ ఎక్కడుందో చూపిస్తే పేదలకు పంచుతాను`` అని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శంకర్‌రావు నారా లోకేష్‌కు సవాల్‌ విసిరారు. లోకేష్ పాదయాత్రకు, సభకు మద్యం, చీరలు, డబ్బులు పంచి జనాన్ని తీసుకొస్తున్నారని చెప్పారు. లోకేష్‌ను పప్పు అని ఎందుకు అంటున్నారో  అర్థమవుతోందని, ఆయన ఓ అయోమయంలా తయారయ్యాడని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే నంబూరు శంక‌ర్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ చేసిన అభివృద్ధి ఏంటో లోకేష్‌ చెప్పాలని, 2400 కోట్లతో అభివృద్ధి చేశామని లోకేష్‌ అబద్ధాలు చెప్తున్నారని దుయ్యబట్టారు. గత ప్రభుత్వంలో ఏమి అభివృద్ధి చేశారో చంద్రబాబు, లోకేష్ ప్ర‌జ‌ల‌కు చెప్పాలన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిపై, వైయ‌స్ జ‌గ‌న్‌ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిపై దమ్ముంటే చంద్రబాబు, లోకేష్ బహిరంగ చర్చకు రావాల‌ని స‌వాల్ విసిరారు. టీడీపీ నేతలను ప్రజలంతా ఛీ కొడుతున్నారన్నారు. లోకేష్‌ అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడ‌ని, రైతుల గురించి టీడీపీ ఏనాడైనా ఆలోచించిందా..? అన్ని వర్గాలను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుద‌ని 

Back to Top