తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీకి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వకూడదో చెప్పాలని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకం, నరమేధం, ఆర్థిక దోపిడీని ప్రజలు పెద్ద ఎత్తున పసిగట్టారు. ఇచ్చిన హామీలను విస్మరించడంతో వైయస్ఆర్‌సీపీ ప్రశ్నిస్తోంది, దీంతో కూటమి ప్రభుత్వం దాడికి దిగుతోందన్నారు. ప్రశ్నించే గొంతులను అక్రమ అరెస్టులు, కేసులతో నొక్కుతుందని మండిపడ్డారు. వైయస్ఆర్‌సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడాన్నిఆయన తీవ్రంగా తప్పుపట్టారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయం వేదికగా ఎమ్మెల్యేలు ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఈ సందర్భంగా తాటిపర్తి చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చినహామీలలో చంద్రబాబు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కూటమి ప్రభుత్వం సమర్ధవంతంగా అబద్ధాలకు రెక్కలు కట్టి ప్రచారం చేశారు. అప్పులు చేశారనిగతంలో మాపై ఆడిపోసుకున్నారు. ఈ బడ్జెట్లో ఆ అప్పులు ఎందుకు చూపించలేకపోయారు. ఎన్నికల సమయంలో ఫెయిడ్ చానల్స్‌పై విఫరీతంగా అప్పులపై దుష్ప్రచారం చేశారు. మేం శాసన సభకు హాజరు కాకపోవడానికి తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. తప్పులను ప్రశ్నించేది ప్రతిపక్షం బాధ్యత కాదా? ఇది మా గొంతు కాదా? రాష్ట్రంలోని అన్ని పార్టీలు జట్టుకట్టి ఇవాళ అధికారంలో ఉన్నాయి. ఏకైక పార్టీ వైయస్ఆర్‌సీపీకి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వకూడదు. దీనిపై విస్తృతంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 11 మందిని చూసి ఎందుకు కూటమి ప్రభుత్వం భయపడుతోంది. మీ తప్పులు భయపెడతాం కాబట్టి భయపడుతున్నారా? 11 మందికి సమాధానం చెప్పే దమ్ము లేదా?. స్పీకర్‌తో ఓ స్టేట్‌మెంట్ ఇప్పించండి. ప్రజల వైపు నిలబడటానికి తగినంత సమయం వైయస్ఆర్‌సీపీకి ఇవ్వాలి. సమయం ఇవ్వకపోతే ఎలా ప్రశ్నించగలం. రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గలపై ప్రశ్నించే అవకాశం ఉంటుందా? రాష్ట్రంలో రోజుకో అరాచకం, హత్యలు, ఆత్యాచారాలు జరుగుతున్నాయి. విచ్చలవిడిగా మద్యం, ఇసుక దోపిడి జరుగుతుంది. సంక్షేమ పథకాలను అటకెక్కించారు. ప్రభుత్వంలోఉన్న ఉద్యోగులను ఏజెంట్లుగా మార్చుకొని తప్పుడు పనులు చేస్తున్నారు. మీ ప్రభుత్వం ఏ పథకానికి ఎంత ఖర్చు చేశారో ఈ బడ్జెట్లో చూపించారా? . ఈ బడ్జెట్లో పథకాలకు కేటాయింపులే లేవు. ఇచ్చిన హామీలకు స్పల్పంగా కేటాయింపులు చేశారు. ఇందుకోసమే ఓటాన్ బడ్జెట్ పేరుతో ఇన్నాళ్లు కాలయాపన చేశారు. దీన్ని కవర్ చేసుకునేందుకు ఫెయిడ్ చానల్స్ ద్వారా తప్పుడు ప్రచారం చేశారు. మేం పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం..మీరు ప్రతిపక్ష హోదా ఇస్తే మా పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మీరు చేసే తప్పులపై సభలో మాట్లాడుతారు. రాష్ట్రంలో ఏం కావాలి. ఎలాంటి సౌకర్యాలు కావాలన్న దానిపై ప్రతిపక్షం చర్చిస్తుంది. అధికార పక్షంతో సమానంగా ప్రతిపక్షానికి సమయం ఇస్తే అర్ధవంతమైన చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై దాడులు జరుగుతున్నాయి. దీనిబట్టే వారివిధానం ఏంటో తెలుస్తుంది. ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తామని హెచ్చరిస్తున్నారు. మీ అక్రమాలను అడ్డుకుంటున్న అధికారులను ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి చర్యలతో ప్రశ్నించే వారు ఎక్కడ ఉంటారు. మీ తప్పులను ఎండగడుతామని భయపడి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా పారిపోతున్నారు. వైయస్ జగన్ ప్రజల పక్షాన యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రభుత్వ తప్పులను కచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటాం. ఒక సమస్య పరిష్కారం కావాలంటే తగిన చర్చ జరగాలి. మేం సౌకర్యాల కోసం ప్రతిపక్ష హోదా అడగడం లేదు. సమస్యలపై చర్చించేందుకే కోరుతున్నామని పేర్కొన్నారు. ప్రతిపక్ష హోదాపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు.