అసెంబ్లీ: పోలవరం ప్రాజెక్టు వద్ద 150 అడుగులతో దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహం ఏర్పాటు చేయాలని, ప్రాజెక్టుకు వైయస్‌ఆర్ పేరు పెట్టేలా పరిశీలించాలని వైయస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ముఖ్యమంత్రిని కోరారు. భూమి మీద మనుషులు ఉన్నంత కాలం వైయస్‌ఆర్ పేరు నిలిచి ఉంటుందన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ.. పోలవరం కలను నిజం చేసిన ఘనత భగీరథుడు వైయస్‌ఆర్‌దని అని కొనియాడారు. ప్రాజెక్టును వైయస్‌ఆర్ ప్రారంభిస్తే.. ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు పూర్తి చేసే భాగ్యాన్ని భగవంతుడు కల్పించాడన్నారు. 2021 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తిచేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నువ్వు ఏం చేశావని చంద్రబాబును అడిగితే.. కరెక్ట్ సమాధానం చెప్పే పరిస్థితిలో కూడా ఆయన లేడని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఎద్దేవా చేశారు. గత ఐదేళ్ల పాలనలో పోలవరం ప్రాజెక్టును పట్టించుకోకపోగా.. నిర్వాసితులకు ఇచ్చిన ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీలోనూ చంద్రబాబు అవకతవకలకు పాల్పడ్డారని చెప్పారు. ఆర్‌అండ్‌ఆర్‌లో అవకతవకలపై విచారణ జరిపించాలని సీఎంను ఎమ్మెల్యే బాలరాజు కోరారు. చంద్రబాబుదంతా మోసం, దగా, కుట్ర, కుయుక్తుల రాజకీయం అని, బాబు నోట ఏనాడూ వాస్తవాలు రావన్నారు.