అధికార పార్టీ అండదండలతోనే రేవ్ పార్టీ  

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఫైర్‌

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా:  అధికార పార్టీ నేత‌ల అండ‌దండ‌ల‌తోనే జిల్లాలో రేవ్ పార్టీ నిర్వ‌హించార‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. జిల్లాలో ఎప్పుడూ లేని విష సంస్కృతిని జ‌న‌సేన నేత‌లు తీసుకువ‌చ్చార‌ని మండిప‌డ్డారు. మండపేట పట్టణ నడిబొడ్డిలో రేవ్ పార్టీ ఏర్పాటు చేయ‌డం శోచ‌నీయ‌మ‌న్నారు. రేవ్ పార్టీ జ‌రిగిన‌ట్లు సోష‌ల్ మీడియాలో అశ్లీల వీడియోలు వైర‌ల్ అవుతున్నా కూట‌మి ప్ర‌భుత్వంలో ఎలాంటి చ‌ల‌నం లేద‌న్నారు. ఇంత‌వ‌ర‌కు పోలీసులు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  ఐదేళ్ల వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వంలో ఎన్నడూ ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు జిల్లాలో చోటు చేసుకోలేద‌ని చెప్పారు. మండ‌పేట రేవ్ పార్టీ నిర్వాహ‌కుల‌పై అధికారుల చర్యలు నామ మాత్రంగా ఉన్నాయంటే దాని వెనుక ఆంతర్యం ఏంట‌ని ప్ర‌శ్నించారు. రేవ్ పార్టీపై సీఎం, డిప్యూటీ సీఎంలు స్పందించాల‌ని తోట త్రిమూర్తులు డిమాండు చేశారు. 

Back to Top