వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు పార్టీని వీడే అవకాశమే లేదు

చంద్రబాబు నీతులు చెబుతూనే దాడులను ప్రోత్సహిస్తున్నారు

రాష్ట్రానికి టీడీపీ ప్రత్యేక హోదా అడగకపోవడం ప్రజాదోహమే

వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ వైయ‌స్ అవినాష్‌ రెడ్డి

న్యూ ఢిల్లీ:  వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు ఎవ‌రు కూడా పార్టీని వీడే అవకాశమే లేద‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ వైయ‌స్ అవినాష్‌ రెడ్డి స్ప‌ష్టం చేశారు. ఏపీలో శాంతిభద్రతలు కనుమరుగయ్యాయి. సీఎం చంద్రబాబు ఒకవైపు నీతులు చెబుతూనే మరోవైపు దాడులను ప్రోత్సహిస్తున్నారని అన్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కడప వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి నేడు లోక్‌సభలో ఎంపీగా ప్రమాణం చేయనున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఢిల్లీ వెళ్లారు.. 

ఈ సందర్బంగా అవినాష్‌ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. కడప పార్లమెంట్ నుంచి వరుసగా మూడోసారి గెలవడం సంతోషంగా ఉంది. వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆశీస్సులు, కడప ప్రజల మద్దతు, కార్యకర్తల కష్టంతో విజయం సాధించాను. నాపై పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేసిన కడప ప్రజలు నాపై నమ్మకం ఉంచారు. వారి అభివృద్ధి కోసం పనిచేస్తాను.

కేంద్రంలో టీడీపీ మద్దతుపై ఆధారపడే ప్రభుత్వం ఉన్నప్పటికీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగకపోవడం ప్రజాదోహమే అవుతుంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు కనుమరుగయ్యాయి. 2019లో మేము విజయం సాధించినప్పుడు మేము ఎవరిపై దాడులకు పాల్పడలేదు. చంద్రబాబు ఒకవైపు నీచులు చెబుతూనే మరోవైపు దాడులను పోత్రహిస్తున్నారు.

వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు పార్టీనీ వీడే అవకాశమే లేదు. పచ్చ కామెర్లు ఉన్నోడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు వారిలాగే అందరు పార్టీ మారుతారని అనుకుంటున్నారు. మేమంతా వైయ‌స్‌ జగన్‌ వెంటే ఉంటామ‌ని  స్పష్టం చేశారు. 

Back to Top