ఎన్నిక‌ల స‌మ‌ర‌భేరీ స‌భ ఏర్పాట్ల ప‌రిశీల‌న‌

విశాఖ‌: ఈ నెల 27న భీమిలి నియోజ‌క‌వ‌ర్గం తగరపువలస  జరిగే  ఎన్నికల సమరభేరి కార్యక్రమానికి సంబంధించి ఏర్పాటును వైయ‌స్ఆర్‌సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త డాక్టర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్, తదితరులు ప‌రిశీలించారు. వచ్చే ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ భారీ మెజార్టీతో విజయం సాధించి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించడం తథ్యమని వైవీ సుబ్బారెడ్డి ధీమా వ్య‌క్తం చేశారు.  ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 27న ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో ఎన్నికల శంఖారావం పూరించి దిశానిర్దేశం చేసే కార్యక్రమ వేదికకు   సంగివలస జాతీయరహదారి పక్కన ఖాళీ స్థలంలో ఏర్పాట్లు చేస్తున్నామ‌ని చెప్పారు. ఉత్తరాంధ్రలో నాయకులతో సమావేశం కావడానికి భీమిలిని ఎంచుకున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశాన్ని విజయవంతం చేయడానికి ప్రతి కార్యకర్త, నాయకుడు కృషి చేయాలన్నారు.   

Back to Top