గ్రామంలో కనీస సౌకర్యాలు కల్పించడం లేదయ్యా..

వైయస్‌ జగన్‌కు  రెల్లి మహిళలు మొర...
శ్రీకాకుళంః  సమస్యలు పట్టి పీడిస్తున్నా టీడీపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని కొర్లవలస గ్రామానికి చెందిన  రెల్లి కులానికి చెందిన మహిళలు వైయస్‌ జగన్‌కు తమ బాధలు చెప్పుకున్నారు.తాగడానికి తాగునీరు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు.నివాసానికి గృహాలు కూడా మంజూరు చేయడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని,  బస్సు సౌకర్యం లేదని వాపోయారు.అర్హత ఉన్నా  పింఛన్లు కూడా ఇవ్వడంలేదన్నారు. నీరుపేదలమయిన తమకు గ్రామంలో కనీస సౌకర్యాలు కూడా టీడీపీ ప్రభుత్వం కల్పించడంలేదని మండిపడ్డారు.చదువుకున్న యువతకు ఉద్యోగాలు లేవన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు రెల్లి కులస్తులకు అందడంలేదన్నారు. రెల్లి కులానికి గుర్తింపులేదన్నారు.
Back to Top