దేవుడు, ప్రజల ఆశీస్సులే జ‌గ‌న‌న్న‌ను కాపాడాయి

రాజకీయంగా ఎదుర్కొలేక చవట, దద్దమ్మల్లా సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌పై దాడి

ప్ర‌జ‌ల గుండెల్లో చిర‌స్థాయిగా నిలిచిపోవాల‌నే మ‌న‌స్త‌త్వం జ‌గ‌న‌న్న‌ది

ఎంత బ్రతిమాలినా కూడా జ‌గ‌న‌న్న‌తో ఒక్క‌ అబద్ధం కూడా చెప్పించలేం

పిల్లల భవిష్యత్‌ కోసం ఆలోచించిన నాయకుడు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ 

గుడివాడలో మేమంతా సిద్ధం బహిరంగసభలో ఎమ్మెల్యే కొడాలి నాని 

గుడివాడ‌: ఐదేళ్ల పాల‌న‌లో స్కూల్‌కు వెళ్లే పిల్లల నుంచి వృద్ధాప్యం వచ్చిన అవ్వాతాతల వరకు వారికి కావాల్సిన ప్రతి అవసరాన్ని తీరుస్తున్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని మాజీ మంత్రి, వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. గుడివాడ‌లో ఏర్పాటు చేసిన మేమంతా సిద్ధం బ‌హిరంగ స‌భ‌లో కొడాలి నాని మాట్లాడారు. సీఎం వైయ‌స్‌ జగన్‌ పాలనతోనే సంక్షేమం సాధ్యమైందని, వాలంటీర్‌ వ్యవస్థతో ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చారని చెప్పారు. పిల్లల భవిష్యత్‌ కోసం ఆలోచించిన నాయకుడు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మాత్ర‌మేన‌న్నారు. ఆరోగ్యశ్రీ ప‌థ‌కం ద్వారా ఎంతోమందిని ఆదుకున్నారని గుర్తుచేశారు. ప్ర‌జ‌ల‌కు మంచి చేస్తున్న సీఎం వైయ‌స్ జగన్‌ను ఎదుర్కోలేక చంద్ర‌బాబు కుట్రలు చేస్తున్నాడ‌ని మండిప‌డ్డారు. దేవుడు, ప్రజల ఆశీస్సులే జ‌గ‌న‌న్న‌ను కాపాడాయని వివ‌రించారు. 

కొడాలి నాని ఇంకా ఏం మాట్లాడారంటే..
మన ప్రియతమ ముఖ్యమంత్రి, వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మనందరి నమ్మకం, మన రాజశేఖర్ రెడ్డి  ముద్దుబిడ్డ వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డికి ఈ గుడివాడ, మచిలీపట్నం నియోజకవర్గాల ప్రజల తరపున స్వాగతం. ఈ సిద్ధం సభ నిన్న జరగాల్సినటువంటి సభ ఒకరోజు వాయిదా పడింది అయినా కూడా ఇంత ఘనంగా వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డిని దీవించడానికి, ఆశీర్వదించడానికి మీరందరూ రావడం ఆనందంగా ఉంది. ఐదేళ్లపాటు వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో గ్రామగ్రామన, వార్డువార్డున సచివాలయాలు ఏర్పాటు చేసి వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకు అందించాల్సిన ప్రతి సౌకర్యాన్ని నేరుగా మధ్యలో ఎటువంటి దళారులు లేకుండా ప్రజల ముందుకే పాలన తీసుకొచ్చినటువంటి, గాంధీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చినటువంటి నాయకుడు వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి. 

అదేవిధంగా స్కూల్ పిల్లలకు వాళ్లకు కావాల్సినటువంటి ఇంగ్లీష్ మీడియం విద్య, బట్టలు, పుస్తకాలు, తిండి అన్నీ కూడా ఒక తండ్రి స్థానంలో చూసినటువంటి వ్యక్తి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి. అదేవిధంగా ఆరోగ్యశ్రీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమంది నిరుపేదల ప్రాణాలను కాపాడినటువంటి వ్యక్తి డాక్టర్ వైయ‌స్ రాజశేఖర్ రెడ్డి అయితే ఆయన చూపించినటువంటి దారి కన్నా నాలుగు అడుగులు ముందుకు వేసి ఈరోజు గన్నవరం నుంచి గుడివాడ వస్తుంటే అనేకమంది ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఒక్కసారి ఆయనకు కనుక చూపించినట్లైతే దానికి ఎంత ఖర్చయినా ఆయన పరిష్కారం చూపిస్తారని చెప్పి కొండంత ఆశతో ట్రీట్ మెంట్ జరుగుతున్నటువంటి పిల్లలను కూడా తీసుకువచ్చి రోడ్డు మీద ఆయనకు చూపించాలనే ఉద్దేశ్యంతో, అంత నమ్మకం పెట్టుకుని చూపిస్తున్నారంటే ఒక వ్యక్తి మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఉన్న నమ్మకం. 

అదేవిధంగా వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు ఒక కూటమి కట్టాడు మాయా కూటమి. ఆయన వదిన పురందేశ్వరిని బీజేపీ అధ్యక్షురాలిని చేశాడు, అదేవిధంగా ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ని ఒకపక్కన పెట్టుకున్నాడు, ఒక ఉత్త పుత్రుడ్ని ఓ పక్కన పెట్టుకున్నాడు. వీళ్లందర్నీ పెట్టుకుని కూడా సిద్ధం సభల ద్వారా వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డికి వస్తున్న ప్రజాదరణను తట్టుకోలేక వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనలేక చవటల్లాగా, దద్దమ్మల్లాగా వెనుక నుంచి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డిని భౌతికంగా ఇక్కడ నుంచి తొలగించాలనే ఉద్దేశ్యంతో మొన్న అర్ధ‌రాత్రి విజయవాడలో ఆయన మీద దాడి జరిగింది. ఆయనెప్పుడూ ఒకటి చెప్తుంటాడు.. పైన ఉన్నటువంటి దేవుడి ఆశీస్సులు ఉన్నాయ్, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులు ఉన్నాయ్ అని చెప్పి. అన్నా మీకు తప్పకుండా ఆ దేవుడి ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే మీకు ఒక అంగుళం పక్కకు జరగలేదు, ఒక అంగుళం కిందకు జరగలేదు. మీకు బలమైనటువంటి నుదుటిమీద తగిలినా ఆ దేవుడు మిమ్మల్ని కాపాడాడు. 

ప్రజల ఆశీస్సులతో మీరు రాబోయే రోజుల్లో తప్పకుండా ఒక 50 రోజుల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. చంద్రబాబు కాదు కదా వాడి బాబు ఖర్జూర నాయుడు వచ్చినా కూడా మీ వెంట్రుక ముక్క కూడా పీకలేడు. మీ దమ్ము, మీ ధైర్యం మీకు ఉన్నటువంటి నిబద్ధత మేము దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తులం. మీది స్వచ్ఛమైనటువంటి చిరునవ్వు. మీరు చెప్పినటువంటి మాట తూచా తప్పకుండా నిలబడేటువంటి తత్వం మీది. ఒక ఓటు కోసం, ఒక పదవి కోసం ఒక్క చిన్న అబద్ధం కూడా మీతో చెప్పించలేనటువంటి పరిస్థితి 5 సంవత్సరాలుగా మేము మిమ్మల్ని దగ్గర నుంచి చూశాం. ఒక్క చిన్న అబద్ధం చెప్పండన్నా అని బ్రతిమాలినా కూడా ఆయనతో అబద్ధం చెప్పించలేం. ప్రజలకు ఇచ్చినటువంటి మాట కోసం, క్యారెక్టర్ కోసం వైయ‌స్ రాజశేఖర్ రెడ్డి  చూపించినటువంటి దారిలో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలన్నటువంటి మనస్తత్వంతో ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని బాధలున్నా ముఖంలో చిరునవ్వు చెదరకుండా మన ముందు నిలబడేటువంటి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ఈ రాష్ట్ర ప్రజలు మరొక్కసారి పట్టం కట్టాలని చెప్పి మీ అమూల్యమైనటువంటి ఓటు మీ రెండు ఓటులను ఫ్యాన్ గుర్తు మీద వేసి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డికి విజయాన్ని అందించాలి.

దుర్మార్గుడైనటువంటి, దొంగైనటువంటి, 420 అయినటువంటి, ఛీటరైనటువంటి, వెన్నుపోటు దారుడైనటువంటి చంద్రబాబు నాయుడ్ని పాతాళంలో పాతి పెట్టాలని చెప్పి.. చంద్రబాబు నాయుడు మొన్న చెప్తున్నాడన్నా.. వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి నీ కథ తేలుస్తానని. చంద్రబాబూ ఇదే నీకు ఆఖరి ఎన్నికలు. జగన్ మోహన్ రెడ్డి అంతు తేల్చాలంటే నువ్వు ఇంకో జన్మ ఎత్తాలి. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు, దేవుడి ఆశీస్సులు ఉన్నటువంటి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డిని మీ అందరూ దీవించాలని చెప్పి మీ అమూల్యమైన రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి మీ ప్రాంతంలో ఉన్నటువంటి శాసనసభ్యుడ్ని, పార్లమెంట్ సభ్యుడ్ని గెలిపించి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి గార్కి మీమంతా ఉన్నాం మీ వెనుక సిద్ధంగా అని చెప్పి మెసేజ్ ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.

Back to Top