విదేశీ పెట్టుబడులు, పరిశ్రమలు ఆకర్శించేందుకు టాస్క్‌ఫోర్స్‌ కమిటీ

మంత్రి గౌతంరెడ్డి నేతృత్వంలో 8 మందితో కమిటీ 
 

తాడేపల్లి: విదేశీ పెట్టుబడులు, పరిశ్రమలు ఆకర్శించేందుకు టాస్క్‌ఫోర్స్‌ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మంత్రి మేకపాటి గౌతంరెడ్డి నేతృత్వంలో 8 మంది అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీలో సభ్యులుగా పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాలవలవన్‌, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌, ఆర్థిక ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ద్వివేది, ఇంధన, ఐటీ శాఖ కార్యదర్శులు శ్రీకాంత్‌, కోన శశిధర్‌, పరిశ్రమ శాఖ డైరెక్టర్‌, ఈడీబీ సీఈవో సుబ్రహ్మణ్యం.  చైనా నుంచి భారత్‌కు తరలివచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న వివిధ దేశాల పరిశ్రమలను ఏపీలో ఏర్పాటు చేసేలా టాస్క్‌ఫోర్స్‌ కమిటీకి బాధ్యతలు అప్పగించారు.

Back to Top