గుంటూరు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రస్థాయి ప్లీనరీలో మహిళా సాధికారత-దిశా చట్టంపై తీర్మానం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ.. మహిళలను శక్తివంతంగా తీర్చదిద్దాలన్నదే సీఎం జగన్ సంకల్పమన్నారు. సామాజిక న్యాయం ఏపీలో సంపూర్ణంగా జరుగుతోందన్నారు. సీఎం వైయస్ జగన్ నాయకత్వంలో మహిళలంతా సంతోషంగా ఉన్నారన్నారు. స్త్రీ మూర్తిని అమ్మగా, ప్రతి మహిళను అక్క చెల్లెమ్మలుగా భావిస్తూ.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు మహిళా సాధికారత కోసం రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, మహిళల పట్ల ఆయన చూపించే గౌరవం, చిత్తశుద్ధి ఏంటో చూస్తున్నాం. మహిళలను రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, సాంస్కృతికంగా, సురక్షితంగా నడిపించాలని సంకల్పిస్తూ.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు, నామినేటెడ్ పదవుల్లో, నామినేషన్ పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి, ఏకంగా 57 శాతం మహిళా సర్పంచ్ లు, 54 శాతం మహిళా ఎంపీటీఎసీలు, 53 శాతం మహిళా ఎంపీపీలు, 53 శాతం మహిళా జెడ్పీటీసీలు, సచివాలయాల్లో 50 శాతం ఉద్యోగాలు, వాలంటీర్లు, 50 శాతం మహిళా మార్కెట్ యార్డ్ ఛైర్ పర్సన్లు, 50 శాతం మహిళళా మున్సిపల్ ఛైర్మన్లు, మేయర్లు, కౌన్సిలర్లతోపాటు, రాష్ట్రానికి దళిత మహిళ హోం మంత్రి, శాసన మండలి వైఎస్ ఛైర్ పర్సన్ గా ఒక మైనార్టీ మహిళను ఎంపిక చేసిన గొప్ప మనసున్న ముఖ్యమంత్రి జగన్ గారు.. - రాష్ట్రంలో ప్రతి పదవుల్లో... ఛైర్మన్ నుంచి ఛైర్ పర్సన్ గా నామకరణం చేసిన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిగారు. దేశంలో కీలకమైన పదవుల్లో మహిళలు ఎంతమంది ఉన్నారనే అంశంపై కేంద్రం ఒక సర్వే చేస్తే.. తెలంగాణలో 28.5 శాతం, రాజస్థాన్ లో 24.7 శాతం, కేరళ 29.5 శాతం, ఏపీలో 51.6 శాతం మహిళలు కీలకమైన పదవుల్లో ఉన్నారు. మహిళల అభ్యున్నతి పట్ల జగన్ మోహన్ రెడ్డిగారి సంకల్పం చాలా బలంగా ఉంది కాబట్టే, మహిళా సాధికారత తీర్మానంతోనే ప్లీనరీ ప్రారంభమైంది. - జగనన్న అమలు చేస్తున్న అమ్మ ఒడి పథకం, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, 31 లక్షల మందికి ఇళ్ళ పట్టాలు.. ఏ పథకం తీసుకున్నా లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరుతుంది. చేయూత ద్వారా మహిళలకు ఆర్థిక సహాయంతోపాటు, స్వయం ఉపాధి కల్పించుకుంటున్నారు. - గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా.. మహిళలను పలకరిస్తే, గతంలో పండగ వచ్చినా, దుస్తులు కొనుక్కోవటానికి కష్టపడే పరిస్థితుల్లో ఉండే తాము.. ఈరోజు పండక్కి బంగారం కొనే పరిస్థితులు వచ్చాయి అని చెబుతున్నారు. అంబేడ్కర్ కలలుగన్న సామాజిక న్యాయం, సాంఘీక న్యాయం వైపు రాష్ట్రం పయనించడం వల్లే మహిళల సాధికారత సాధ్యమైంది. చంద్రబాబు డ్వాక్రా మహిళల రుణాలన్నింటినీ వడ్డీతో సహా మాఫీ చేస్తానని హామీ ఇచ్చి, మోసం చేస్తే.. జగనన్న అధికారంలోకి వచ్చాక, దాదాపు 78 లక్షల మంది మహిళలకు ఇప్పటి వరకు రూ. 12,757 కోట్లు ఇచ్చారు. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ద్వారా 30.15 లక్షల మహిళలకు న్యూట్రేషన్స్ ఇస్తూ.. మహిళల్ని ఆరోగ్యపరంగా ముందుకు నడిపిస్తున్నారు. కొవిడ్ ప్రపంచాన్ని కుదిపివేసినా.. ఏపీలో మాత్రం ఏ ఒక్క సంక్షేమ పథకం ఆగలేదు. - అమ్మ ఒడి పథకం ద్వారా .. ప్రతి ఒక్క ఆడబిడ్డ గ్రాడ్యుయేట్ కావాలన్నదే జగన్ గారి లక్ష్యం.. - దిశ యాప్ ద్వారా.. మహిళలకు న్యాయం చేయాలన్నదే జగన్ గారి ధ్యేయం - ప్రతి విద్యార్థిని గ్రాడ్యుయేట్ కావాలి.. ప్రతి మహిళ లక్షాధికారి కావాలి... 21 శతాబ్దం మహిళ ఏపీ నుంచే రావాలి.. అన్నదే జగనన్న ఆశయం.. - అభినవ పూలేలా.. జగనన్న మహిళలకు సామాజిక న్యాయం చేస్తుంటే.. టీడీపీ నేతలు మహానాడు పేరుతో నిత్యం విమర్శలు చేస్తున్నారు. సిగ్గులేకుండా, చంద్రబాబు మహిళలతో తొడలుకొట్టించాడు. మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు వ్యతిరేకం కాబట్టి, ఈ సంక్షేమ పథకాలన్నీ ఆపేయాలన్నదే మీ ఉద్దేశమా.. అని ప్రశ్నిస్తున్నాం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని మంచి మనసుతో, మానవత్వంతో అమలు చేస్తున్నారు. టీడీపీ వాళ్ళకు కూడా చేతులు జోడించి చెబుతున్నాను. ముఖ్యమంత్రి గారు ప్రమాణస్వీకారం చేసేటప్పుడు ఏ మాట అయితే చెప్పారో, ఇచ్చిన మాట ప్రకారం, నేను ఉన్నాను.. విన్నాను.. అంటూ సంక్షేమ పథకాల అమలు కోసం బటన్ నొక్కే ప్రతిసారీ ఆయన యొక్క చిత్తశుద్ధి కనిపిస్తూనే ఉంది. ఇటువంటి నాయకుడ్ని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ప్రజలంతా భావిస్తున్నారు. 2024 ఎన్నికల్లో ప్రతి మహిళా, జగనన్న సుపరిపాలనకు కానుకగా ఓటుతో పాటు రాఖీని కూడా పంపాలి.