తాడేపల్లి: తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు కవి గిడుగు రామమూర్తి గారు తెలుగు వాడుక భాష కోసం చేసిన కృషిని గుర్తుచేసుకుంటూ.. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్న తెలుగువారందరికీ శుభాకాంక్షలు అంటూ సోషల్ మీడియా వేదికగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. వ్యవహారిక భాషోద్యమానికి తన జీవితాన్నే అంకితం చేసిన మహనీయులు గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారు. మాతృభాష పరిరక్షణకు ఆయన చేసిన కృషి మరిచిపోలేనిది. నేడు గిడుగు గారి జయంతి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు అంటూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.