కాసేపట్లో పార్టీ నేతలతో వైయ‌స్‌ జగన్‌ భేటీ

 
 తాడేపల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి నేడు పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలు హాజరుకానున్నారు.

వైయ‌స్‌ జగన్‌ నేడు తాడేపల్లిలో పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలు సమావేశంలో పాల్గొన్ననున్నారు. ఈ సమావేశంలో పూర్తి స్థాయి కార్యవర్గాల ఏర్పాటు సహా పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే, బూత్ లెవల్‌లో కేడార్‌ను చైతన్యవంతులను చేసేలా చర్యలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

ఇక, త్వరలోనే నియోజకవర్గాల వారీగా సమీక్షకు వైయ‌స్‌ జగన్‌ సిద్ధమయ్యారు. ఇప్పటికే మంగళగిరి, రేపల్లె నియోజకవర్గాలకు కొత్త ఇన్‌చార్జ్‌లను నియమించిన విషయం తెలిసిందే. రానున్న రోజుల్లో మిగతా నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌ల నియామకాలపై కూడా ఈరోజు సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

Back to Top