వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయాల కూల్చివేతపై విచారణ.. తీర్పు రిజర్వ్‌

అమరావతి : వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయాల కూల్చివేతపై  ఏపీ హైకోర్టులో విచారణ ముగిసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు స్టేటస్‌ కో కొనసాగేలా ఆదేశాలు జారీ చేసిన కోర్టు.. తీర్పు రిజర్వ్‌ చేసింది.

ఏపీ ప్రభుత్వంతో న్యాయపోరాటం కొనసాగించాలని వైయ‌స్ఆర్‌సీపీ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 11 వైయ‌స్ఆర్‌సీపీ పార్టీ కార్యాలయాలకు అక్రమ కట్టడాలంటూ అధికారులు ఇచ్చిన నోటీసులపై పార్టీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. బుధవారం లంచ్‌ మోషన్‌ వేయడంతో.. అధికారులకు కోర్టు బ్రేకులు వేసింది. ఇవాళ్టి వరకు యధాతథ స్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది.  అయితే మరికొన్ని కార్యాలయాలకు ఇచ్చిన నోటీసులను సవాల్‌ చేస్తూ.. ఏపీ హైకోర్టులో ఇవాళ వైయ‌స్ఆర్‌సీపీ మరో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ వేసింది. 

Back to Top