అబద్ధాలు, అర్ధసత్యాలు.. పోలవరంపై చంద్రబాబు శ్వేతపత్రం

విజయవాడ: అబద్ధాలు, అర్ధ సత్యాలతో పోలవరంపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు సీఎం చంద్రబాబు. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు చాలానే అవస్థలు పడ్డారు. మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌పై ఆరోపణలతోనే తొలి శ్వేతపత్రాన్ని విడుదల చేసిన చంద్రబాబు.. ప్రాజెక్టును ఎప్పుడు పూర్తి చేస్తారో మాత్రం చెప్పలేదు. 
చంద్రబాబు ప్రభుత్వ ప్రణాళిక లోపంతోనే డయాఫ్రం వాల్‌ కొట్టుకుపోగా, నాడు చంద్రబాబు పునాది స్థాయిలో వదిలేసిన స్పిల్‌ను 48 గేట్లతో సహా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పూర్తి చేసింది. డయాఫ్రం వాల్‌ దెబ్బతినడానికి ముమ్మాటికి చంద్రబాబు ప్రభుత్వమే కారణం. ఇదే అంశాన్ని ఐఐటీ హైదరాబాద్‌, ఎన్‌హెచ్‌పీసీ  నివేదికలు స్పష్టం చేశాయి. రెండేళ్ల కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ పోలవరం పనులను వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పరుగులు పెట్టించింది. సీడబ్ల్యూసీ డిజైన్‌ కోసం రెండేళ్లుగా ఎదురుచూస్తున్నా.. వైఎస్‌ జగన్‌పై నిందమోపే ప్రయత్నం చేశారు చంద్రబాబు.

భజన చట్టం ప్రకారం కేంద్రమే నిర్మించాల్సిన పోలవరాన్ని కమీషన్లకు ఆశ పడి దక్కించుకున్న చంద్రబాబు సర్కార్‌ ప్రాజెక్టు నిర్మాణ ప్రణాళికను తుంగలో తొక్కింది. సులభంగా చేయగలిగి, కాంట్రాక్టర్లకు అధికంగా లాభాలు వచ్చే పనులకే ప్రాధాన్యత ఇచ్చింది.   ప్రపంచంలో ఎక్కడైనా వరదను మళ్లించేలా స్పిల్‌వే, కాఫర్‌ డ్యామ్‌లు కట్టాకే ప్రధాన డ్యామ్‌ పనులు చేపడతా­రు. 2014–19 మధ్య పోలవరంలో చంద్రబాబు సర్కార్‌ అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించింది.

గోదావరి వరదను మళ్లించే స్పిల్‌వే పునాది స్థాయి కూడా దాటలేదు. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లను ప్రారంభించనే లేదు. కానీ.. డ్యామ్‌ గ్యాప్‌–2లో పునాది డయాఫ్రమ్‌వాల్‌ పనులను 2017లో ప్రారంభించి 2018 జూన్‌ 11 నాటికి పూర్తి చేశారు. 35 మీటర్ల కాంటూర్‌ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పింస్తామంటు హామీ ఇచ్చి 2018 నవంబర్‌లో ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులను ప్రారంభించారు. ఇదే ప్రధాన డ్యామ్‌గా చిత్రీకరించి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రయత్నించారు.

2019 ఫిబ్రవరి నాటికి కూడా నిర్వాసితులకు పునరా­వాసం కల్పింంచకపోవడంతో పోలవరం ప్రాజెక్టు అథారిటీ, సీడబ్ల్యూసీ ఇదే అంశాన్ని ప్రస్తావిస్త⇒ నిర్వాసితులకు పునరా­వాసం కల్పిస్తూ కాఫర్‌ డ్యామ్‌ల పనులు చేయాలని ఆదేశించింది. అయితే పునరావాసం కల్పింంచలేక ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేసి పనులు ఆపేశారు.  

2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించడంతో అదే ఏడాది మే 30న సీఎంగా వైఎస్‌ జగన్‌ బాధ్యతలు చేపట్టారు. జూన్‌ రెండో వారంలోనే గోదావరికి వరద ప్రారంభమైంది. అంటే.. వైఎస్‌ జగన్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టడానికి, గోదావరి వరద ప్రారంభం కావడానికి మధ్య కేవలం 10 నుంచి 12 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ వ్యవధిలో కాఫర్‌ డ్యామ్‌లలో ఖాళీ ప్రదేశాలను భర్తీ చేయడం ఎలా సాధ్యమన్నది చంద్రబాబే చెప్పాలి.

గోదావరికి 2019లో భారీగా వరదలు వచ్చాయి. పోలవరం ఎగువ కాఫర్‌ డ్యామ్‌ వద్ద 2.4 కి.మీ. వెడల్పుతో ప్రవహించాల్సిన గోదావరి వరద.. కాఫర్‌ డ్యామ్‌లు వదిలిన 800 మీటర్ల ఖాళీ ప్రదేశానికి కుచించుకుపోయి ప్రవహించాల్సి రావడంతో వరద ఉద్ధృతి పెరిగి డయాఫ్రమ్‌వాల్‌లో నాలుగు చోట్ల కోతకు గురై 485 మీటర్ల పొడవున దెబ్బతింది. ఈసీఆర్‌ఎఫ్‌ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై గ్యాప్‌–1లో 35 మీటర్ల లోతు, గ్యాప్‌–2లో 26 నుంచి 36.50 మీటర్ల లోతుతో కూడిన అగాధాలు ఏర్పడ్డాయి.

వీటిన్నింటినీ అధ్యయనం చేసిన ఐఐటీ–హైదరాబాద్, నేషనల్‌ హైడ్రో పవర్‌ కార్పొరేషన్‌ సంస్థలు మానవ తప్పి­దం వల్లే పోలవరంలో విధ్వంసం చోటుచేసుకుందని తేల్చి చెప్పాయి. అంటే ఆ తప్పిదం చేసింది చంద్రబాబేనని తేల్చాయని సాగునీటిరంగ నిపుణులు పేర్కొంటున్నారు.

 

Back to Top