సర్వేపల్లిలో సోమిరెడ్డి దందాలు ప్రారంభం

మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి

సోమిరెడ్డి అవినీతి నియోజకవర్గంలో నెలరోజుల్లోనే  కోడై కూస్తుంది

సోమిరెడ్డి.. "చుక్క" ఏదో రాత్రిపూట పుచ్చుకో..పగటి పూట మంచిది కాదు

తెలుగుదేశం నాయకుల ఉడుత బెదిరింపులకు భయపడం

నెల్లూరు: సర్వేపల్లి లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నెల రోజులలోనే ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి తన అవినీతి కార్యకలాపాలను వేగంగా విస్తరించాడ‌ని మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి విమ‌ర్శించారు. చట్ట ప్రకారం అన్ని అనుమతులున్న లేఅవుట్ యజమానులను బెదిరించి, భారీగా వసూళ్లకు పాల్పడుతున్నాడ‌ని మండిప‌డ్డారు. శ‌నివారం మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి ఏమ‌న్నారంటే..

  • ఏపీ జెన్కో యాష్ పాండ్ నుండి నిబంధనలకు విరుద్ధంగా బూడిదను తరలిస్తూ సోమిరెడ్డి, ఆయన కొడుకు రాజగోపాల్ రెడ్డి సొమ్ము చేసుకుంటున్నారు.
  • సోమిరెడ్డి కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ విషయంలో వాస్తవాలను వక్రీకరిస్తూ, నోటికొచ్చిన అబద్ధాలు మాట్లాడుతున్నాడు.
  • కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ విషయంలో వైకాపా విధానాలను విమర్శిస్తున్న సోమిరెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే, విచారణ జరిపించి అక్రమాలు వెలికి తీయాలి.
  • కాకాణికి కళ్లు కనబడటం లేదు, కంట్లో చుక్కలు వేసుకోవాలని సూచించే సోమిరెడ్డికి, పగలు పర్యటనకు వెళ్లేటప్పుడు తాను "చుక్క" వేసుకోకుండా వెళ్లితే మంచిదని సూచిస్తున్నా.
  • వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారి ఆస్తులను, దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను, అభివృద్ధి శిలాఫలకాలను ధ్వంసం చేసేవారు తిరిగి వారే వాటినన్నింటిని పునరుద్ధరించే రోజు వస్తుందని, గుర్తుపెట్టుకోవాలని హెచ్చరిస్తున్నా.
  • రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి వ్యవహారాలు బాగా జోరందుకుంటున్నాయి.
  • సోమిరెడ్డి 20 సంవత్సరాల తర్వాత శాసనసభ్యుని హోదాలో కృష్ణపట్నం పోర్టుకు వెళ్లి, కంటైనర్ గురించి అర్ధరహిత వ్యాఖ్యలు చేయడం జరిగింది.
  • కంటైనర్ టెర్మినల్ తరలిపోవడానికి కారణం మేమంటూ సోమిరెడ్డి మాట్లాడుతున్నాడు.
  • కంటైనర్ వెజల్స్ వస్తున్నాయని కృష్ణపట్నం పోర్టు యజమాన్యం చెబుతుంది.
  • పోర్టు యాజమాన్యం కంటైనర్ టెర్మినల్ మూయలేదని చెప్తున్నా, సోమిరెడ్డి నానారకాల మాటలు మాట్లాడుతున్నాడు.
  • గోవర్ధన్ రెడ్డికి కళ్లు కనిపించడం లేదేమో,  చుక్కలు వేసుకొని చూడాలని సోమిరెడ్డి వ్యాఖ్యానించడం హాస్యాస్పదం.
  • సోమిరెడ్డీ.. నేను కళ్లలో చుక్కలు వేసుకోవల్సిన అవసరం లేదు.. నువ్వు నిన్నటి లాగా  "చుక్క" వేసుకొని పగలు బయటకు  వెళ్లవద్దని సలహా..
  • సోమిరెడ్డి.. "చుక్క" ఏదో రాత్రిపూట పుచ్చుకొని, పగటి పూట మానుకుంటే మంచిది.
  • అధికార పార్టీలో ఉన్న సోమిరెడ్డికి ధైర్యం ఉంటే, కంటైనర్ టెర్మినల్ విషయంలో ఏదైనా పొరపాటు జరిగి ఉంటే విచారణ జరిపించి, నిజాలు బయటపెట్టాలి.
  • సోమిరెడ్డి ప్రకటనలకే పరిమితమవుతూ, అవినీతి సంపాదనలో మునిగి తేలడం సరికాదు.
  • సోమిరెడ్డి దేనికోసం ఆదాని కాళ్లు పట్టుకుంటానంటున్నాడో ప్రజలకు తెలియడం లేదు.
  • ఎన్నికల్లో  కలెక్షన్ కోసం అందరి కాళ్లు పట్టుకున్న సోమిరెడ్డి, ఇప్పుడు ఏ అవసరాల కోసం ఆదాని కాళ్లు పట్టుకుంటానంటున్నాడో ప్రజలకు తెలియజేయాలి.
  • సోమిరెడ్డి  కలెక్షన్ కోసం కాళ్లు పట్టుకునేందుకు వెళ్లాడో, ప్రజల అవసరాల కోసం వెళ్ళాడో స్పష్టత లేదు.
  • సోమిరెడ్డీ, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన  ఈ నెల రోజులలో  నువ్వు అవినీతి సొమ్ము సంపాదించలేదని దేవునిపై ప్రమాణం చేయడానికి సిద్ధమా..!
  • జెన్కో యాష్ పాండ్ నుంచి బూడిద, అక్రమ లేఔట్ల వారిని బెదిరించి, గ్రావెల్ దోపిడికి పాల్పడుతూ, కాంట్రాక్టర్లను బ్లాక్ మెయిల్ చేస్తూ, సోమిరెడ్డి కాసులు దండుకుంటున్నాడు.
  • సోమిరెడ్డి అవినీతి నియోజకవర్గంలో నెలరోజుల్లోనే  కోడై కూస్తుంది.
  • అధికారం శాశ్వతంగా ఉంటుందని టీడీపీ నాయకులు విర్రవీగుతున్నారు.
  • రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకుల దౌర్జన్యాలు ఎక్కువయ్యాయి.
  • తెలుగుదేశం నాయకుల ఉడుత బెదిరింపులకు భయపడము.
  • అధికారం ఉన్నా లేకపోయినా, ఎవ్వరికీ ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉండి, అండగా నిలబడుతాం.
  • జిల్లాకు సంబంధించి కానీ, సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి కానీ, ప్రజలకు వాచ్ మెన్ డ్యూటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం.
Back to Top