<strong>శ్రీకాకుళంః </strong>చంద్రబాబు ఎన్నికల ప్రచారం విస్మయం కలిగిస్తుందని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఏపీలో నిసిగ్గుగా 23 మంది వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి వారిలో నలుగురికి మంత్రుల పదవులు ఇచ్చి.. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఓడించాలని, రాజ్యాంగ విరుద్ధమని చంద్రబాబు వ్యాఖ్యలపై భూమన తప్పుబట్టారు.చంద్రబాబు నాలుక శాఖోపశాఖలగా చిలీపోయిందని చెప్పడానికి ఇది నిదర్శనమన్నారు. తన స్వార్థ రాజకీయాలు కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తిత్వం చంద్రబాబుదని విమర్శించారు.అవినీతిపరులపై దాడులు చేసే స్వతంత్ర ప్రతిపత్తి గల సీబీఐను నీరుగార్చి తన గుప్పెట్లో ఉన్న ఏబీసీతో దాడులు చేయించడం చంద్రబాబు దుర్బేద్ధే అని అన్నారు. పచ్చి అవకాశవాద రాజకీయాలు చేయడంలో చంద్రబాబుకే చెల్లిందన్నారు.