'30వేల రుణం తీసుకుంటే 302 రూపాయలు మాఫీ'

వెలిగొండ ప్రాజెక్టు(ప్రకాశం జిల్లా): ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల రుణాలు మాఫీ చేయడంలో విఫలమయ్యారని రైతులు ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రాజెక్టుల కోసం చేపట్టిన బస్సుయాత్రలో భాగంగా గురువారం రాత్రి ఇక్కడకు వచ్చారు. ప్రాజెక్టు టెన్నెల్ లోపలికి వెళ్లి  పరిశీలించిన అనంతరం  రైతులతో ముఖాముఖీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ రైతు మాట్లాడుతూ తాను  30వేల రూపాయల రుణం తీసుకుంటే  302 రూపాయలు మాత్రమే మాఫీ అయినట్లు తెలిపారు.

చంద్రబాబు మాటలు నమ్మలేం అని రైతులు అన్నారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ఇంకా పరిహారం అందలేదని చెప్పారు. ఈ ప్రాజెక్టు గురించి చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదన్నారు.
Back to Top