హైదరాబాద్: మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి లాగా ఆయన తనయుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి కూడా పరిణతి చెందారని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ఒకసారి ఆయనకు పాలనా అవకాశాలు ఇవ్వాలని మాజీ ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్రకార్యాలయంలో జరిగిన జననేత పుట్టిన రోజు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపి మోకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ యువనేత దాదాపు 3500 కిలోమీటర్లు నడిచి, సమాజంలోని అన్ని వర్గాల వారిని కలుసుకుంటూ, వారి సాదకభాదలను తెలుసుకుని భరోసా ఇస్తున్నారన్నారు. ఇంత సుదీర్ఘ పాదయాత్ర చేసిన నాయకులు దేశంలోనూ, ప్రపంచంలోనూ మరొకరు లేరు, మహానేత వైయస్ఆర్ పాదయాత్ర చేసి ఆరోజు ప్రజల కష్టాలను తెలుసుకుని, అనేక ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టారని, అదే విధంగా వైయస్ జగన్ కూడా పరిపూర్ణమైన ప్రజా నాయకుడిగా పరిణతి సాధించారన్నారు. జగన్ ముఖ్యమంత్రి కావాలని ప్రజంతా ఆకాంక్షిస్తున్నారన్నారు.ప్రజలకు హితమైన అన్ని అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి రాష్ట్రాన్ని ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దుతారన్న విశ్వాసం ప్రజల్లందరిలో నెలకొందన్నారు. నిరంకుశమైన, అవినీతమయమైన టిడిపి ప్రభుత్వానికి తిలోదకాలు ఇచ్చి, ప్రజాహితమైన కార్యక్రమాలను చేపట్టే జగన్ కు అధికాకం కట్టబెట్టాల్సిన అవసరం ఉందన్నారు. జగన్ మోహన్ రెడ్డికి వస్తున్న ప్రజా దరణను చూసి ఓర్వలేకు ఆయనపై పై హత్యాయత్నానికి ఒడి గట్టిన వారెవరో ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రం చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో , దుర్మార్గమైన పాలనకు అంతం పలకడానికి విజ్ఞతతో వ్యవహరించాలని ప్రజలందరికీ పిలుపునిచ్చారు.