కడిగిన ముత్యంలా వస్తారు: జగపతి

మెదక్: ఎటువంటి తప్పు చేయని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జైలు నుంచి కడిన ముత్యంలా బయటకు వస్తారని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ బట్టి జగపతి ధీమా వ్యక్తం చేశారు. ఆయన పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు గె లెన్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. జగన్‌కు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై ఆయన్ని జైలు పాల్జేశారన్నారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటాలు చేస్తూ ప్రజలకు చేరువైన నేత ఒక్క  జగన్‌మోహన్‌రెడ్డేనని తెలిపారు. ఆయన విడుదలను ఆక్షాంక్షిస్తూ గురువారం మెదక్ పట్టణంలోని సీఎస్‌ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలిరావాలని పిలుపునిచ్చారు.

కార్యకర్తలు హాజరు కావాలి
నర్సాపూర్: జగన్‌మోహన్‌రెడ్డి గురువారం జైలు నుంచి విడుదల కావాలని కోరుతూ మెదక్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నట్లు ఆ పార్టీ జిల్లా వాణిజ్య విభాగం కన్వీనర్ పీ శ్రీధర్‌గుప్త తెలిపారు. వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని కోరారు.

పెద్ద ఎత్తున పాల్గొనాలి
సంగారెడ్డి: మెదక్ సీఎస్‌ఐ చర్చిల్లో ప్రార్థనలు చేయనున్నట్లు ఆ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. ఈ ప్రార్థనల్లో వైయస్‌ఆర్‌ సీపీ యువజన విభాగం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఇదిలా ఉండగా జగన్ జైలు నుంచి విడుదల కావాలని కోరుతూ శ్రీధర్‌రెడ్డి   సంగారెడ్డి పట్టణం రాజంపేట సమీపంలోని ఫతేఖాన్‌దర్గాలో ముస్లిం సోదరులతో కలిసి  కోరుతూ ప్రార్థనలు చేశారు.  సాయిబాబా ఆలయంలో శ్రీధర్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సేవల్లో వైయస్ఆర్ సీపీ యువజన విభాగం భేష్
అనపర్తి : సేవా కార్యక్రమాల్లో అనపర్తి మండల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆదర్శంగా నిలుస్తుందని ఆ పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు సత్తి వీర్రెడ్డి పేర్కొన్నారు. అనపర్తి మండల యువజన విభాగపు కన్వీనర్ సత్తిరామకృష్ణారెడ్డి(రాంబాబు) జన్మదినోత్సవంలో యువజన విభాగం శ్రేణులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని వీర్రెడ్డి ప్రారంభించారు. అనపర్తి సామాజిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహిం చిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న సత్తి వీర్రెడ్డి, స్టీరింగ్ కమిటీ సభ్యురాలు కర్రి శేషారత్నం మాట్లాడారు. దాదాపు 50 మంది యువకులు రక్తదానాన్ని చేయగా కాకినాడ రోటరీ బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు సేవలందించారు. 

సకాలంలో నీరు లేకే ఈ దుస్థితి : నాగిరెడ్డి
గూడూరు: ప్రభుత్వం ఖరీఫ్ సీజన్‌లో సకాలంలో సాగునీరు విడుదల చేయకపోవడం వల్లే నేడు రైతులు ముంపు సమస్య ఎదుర్కొంటున్నారని వైయస్ఆర్ సీపీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనరు ఎం.వి.ఎస్. నాగిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ నెలలో సాగునీరు విడుదల చేయాల్సి ఉండగా జూలై చివరి నాటికి కాలువలకు సాగునీరు విడుదల చేసిందని పేర్కొన్నారు. అది కూడా పూర్తిస్థాయిలో విడుదల చేయకపోవడంతో ఎన్నడూ లేని విధంగా సెప్టెంబరు 20 వరకు కూడా జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరినాట్లు వేయాల్సిన దుస్థితి రైతాంగానికి ఏర్పడిందని తెలిపారు. సకాలంలో వరినాట్లు వేసుంటే వరిపైరు ఏపుగా పెరిగి నేడు చేలన్నీ చిరు పొట్టదశలో ఉండి ముంపుబారిన పడే ప్రమాదం తప్పేదని వివరించారు. ఒక వైపు సాగునీరు అందక, అవస్థలు పడిన రైతాంగం ఎరువుల ధరలు సైతం విపరీతంగా పెంచడంతో వ్యవసాయం అంటేనే హడలిపోవాల్సిన పరిస్థితి కర్షకులకు ఏర్పడిందని పేర్కొన్నారు. అధిక వర్షాల వల్ల ముంపునకు గురైన పొలాలకు ప్రభుత్వం నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. 

జగన్‌ రాకతో మంచి రోజులు
నాయుడుపేట: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి రాకతో రాష్ట్ర ప్రజలందరికీ మంచి రోజులు వస్తాయని ఆ పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు దబ్బల రాజారెడ్డి చెప్పారు. నాయుడుపేటలోని పార్టీ యువజన నాయకులు పాలూరు దశరథరామిరెడ్డిని బుధవారం ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. జగన్ సూచనల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేస్తూనే, పార్టీని పటిష్టం చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. పార్టీలో కార్యకర్తలందరి మధ్య క్రమశిక్షణను పెంపొందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఆయన వెంట కళాత్తూరు శేఖర్‌రెడ్డి, మీంజూరు రామకృష్ణ, షేక్ రఫి, ఎల్లసిరి నీరజమ్మ, గండవరం సురేష్‌రెడ్డి, చెంచురామయ్య తదితరులు ఉన్నారు.

జగన్‌తోనే గిరిజన సంక్షేమం: మాజీ ఎమ్మెల్లీ
డుంబ్రిగుడ: వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోనే గిరిజన సంక్షేమం సాధ్యమని మాజీ ఎమ్మెల్సీ కిడారి సర్వేశ్వరావు అన్నారు. కొర్రాయి పంచాయతీ మాజీ సర్పంచ్ కిల్లో దొన్నో, బి. చెల్లయ్యల సారధ్యంలో గత్తర జిల్లెడలో పార్టీ జెండావిష్కరణ చేపట్టారు. ఈ సందర్భంగా కొర్రాయి పంచాయతీ పరిధిలోని టీడీపీ, సీపీఎంలకు చెందిన 500 మంది వైయస్ఆర్‌ సీపీలో చేరారు. అందరికీ పార్టీ కాండువాలు కప్పి కిడారి ఆహ్వానించారు. ఆయ న మాట్లాడుతూ వైఎస్ పథకాలు అమలు కావాలంటే జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావాలన్నారు. గిరిజన గ్రామాలో మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మండలంలో ఇందిరమ్మ పథకంలో భారీగా అవినీతి జరిగినా సంబంధిత అధికారులపై చర్యలు లేకపోవడం శోచనీయమన్నారు. ప్రజ లు వైఎస్సార్‌సీపీ పట్ల మొగ్గు చూపుతున్నారన్నారు. రానున్నకాలంలో జగన్‌మోహన్‌రెడ్డి పార్టీయే అధికారంలోకి వస్తుందన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు ఎం. శ్రీరాము లు, ఎం. స్వామి, శెట్టి అప్పాలు, పాండురంగస్వామి, మండి లక్ష్మీ, ఎల్.బి. కుమారి, ద్రౌపతి, బి. సువర్ణకుమారి, శెట్టి భాస్కర్‌రావు, దురియా సాయిబాబా, రఘునాథ్, పలు పార్టీల నాయకులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

గడప గడపకు వైఎస్‌ఆర్ సీపీకి స్పందన
కొట్యాడ: కొట్యాడ గ్రామంలో నిర్వహించిన గడప గడపకు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. పార్టీ నాయకుడు వల్లూరి జయప్రకాష్‌బాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి పార్టీ విధి విధానాలు వివరించారు. వీరభద్రస్వామి ఆలయ సమీపంలో పార్టీ జెండాను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన రుద్ర అప్పారావు, కడగల అప్పలరాజు సమక్షంలో 200 కుటుంబాలు వల్లూరి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వల్లూరి మాట్లాడుతూ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసే వరకు కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజల నుంచి లభిస్తోన్న ఆదరణను చూసి ఓర్వలేకే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు నైతిక విలువలను పక్కనపెట్టి ఒక్కటై కుట్రలు పన్నాయని ఆరోపించారు. చివరకు జైలుకు పంపిన వరకూ రెండు పార్టీలు ఏకతాటిపై నిలిచి పని చేశాయని విమర్శించారు. వీటిని ప్రజలు గమనిస్తున్నారని వారే తగిన సమయంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అనంతరం వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ముంపునకు గురైన ఎస్సీ కాలనీని సందర్శించారు. బాధితులను పరామర్శించారు. పంట పొలాలను పరిశీలించారు. రైతులను ఆదుకోవాలని డీఆర్‌ఓను ఫోన్‌లో కోరారు. తహశీల్దార్ జె.రాములమ్మను కలిసి నష్టాలపై వివరించారు. ఆయన వెంట పార్టీ నాయకులు భీమిలి మాజీ సర్పంచ్ పిట్టబాబు, వేపాడ మండల కన్వీనర్ గొంప నాగభూషణం, కొత్తవలసకు చెందిన రంధి అప్పలనాయుడు, కోటేశ్వరరావు, కొట్యాడ గురుమూర్తి, నగేష్ పాల్గొన్నారు.

Back to Top