<br/><br/><br/><br/>వెనుకబడిన జిల్లాలను అభివృద్ధిపథంలోకి నడిపిన ఘనత దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డిదే అని వైయస్‌ఆర్‌సీపీ నాయకురాలు రెడ్డి శాంతి అన్నారు.నాలుగున్నర ఏళ్లలో టీడీపీ ప్రభుత్వం వెనుకబడిన జిల్లాలను మరింత వెనక్కు నెట్టిందని విమర్శించారు. వైయస్ జగన్ అధికారంలోకి వస్తే మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని, వెనుకబడిన జిల్లాలు ప్రగతిమార్గంలో దూసుకుపోతాయన్నారు. విద్య, వైద్య,మౌలిక రంగాలు సమస్యల వలయంలో చిక్కుకుని ప్రజలు కష్టాలు పడుతున్నారన్నారు. ప్రభుత్వం అండదండలు లేకపోవడంతో మహిళలు జీవనాధారం కోల్పోయారన్నారు. ఏ వర్గాలకు కూడా సంక్షేమ పథకాలు అందడంలేదన్నారు. ఆస్తులు అమ్ముకుని తమ బిడ్డలను తల్లిదండ్రులు చదివిస్తే ఉద్యోగాలు లేవన్నారు. వైయస్ జగన్ ప్రకటించిన నవరత్నాల పట్ల ప్రజల్లో నమ్మకం కలుగుతుందన్నారు.