కేంద్రం కళ్ళు తెరిపించేలా సమైక్య ఉద్యమం

కాకినాడ, 2 అక్టోబర్ 2013:

కేంద్రం కళ్లు తెరిపించేలా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉధృతం చేస్తుందని కాకినాడ మాజీ ఎమ్మెల్యే, వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ నగర కన్వీన‌ర్ ద్వారంపూడి చంద్రశేఖర‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్‌తో పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు బుధవారం నుంచి సీమాంధ్రలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిరాహార దీక్షలు ప్రారంభించారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ మసీదు సెంటర్‌లో ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి దీక్షకు దిగారు.

మహాత్మాగాంధీ, పొట్టి శ్రీరాములు,‌ వైయస్ రాజశేరరెడ్డి చిత్రపటాలకు ఈ సందర్భంగా ద్వారంపూడి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం దీక్షా ప్రాంగణంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఈ దీక్షా ప్రాంగణానికి సమైక్యవాదులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాష్ట్రంలో పోరాట పటిమ ఉన్న ఏకైక నాయకుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి అని చంద్రశేఖరరెడ్డి అన్నారు. శ్రీ జగన్ నేతృత్వంలో తాము సమైక్యాంధ్ర సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ‌టిడిపి ఇప్పటికీ రెండు కళ్ల సిద్ధాంతాన్నే అనుసరిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు.

Back to Top