ఈ మూడేళ్లలో ఏం సాధించారు..?

రాజధాని పేరుతో    భూ దోపిడీ..
అగ్రిగోల్డ్‌పై సీబీఐ విచారణ జరిపించాలి..
విజయవాడః రాజధాని పేరుతో చంద్రబాబు దోపిడీకి పాల్పడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి మండిపడ్డారు. రాజధానికి శంకుస్థాపన చేసి మూడేళైందని,  ఈ మూడేళ్లు సాధించింది రాజధాని భూముల్లో గేదెలు మేపుకోవడం తప్ప ఏం సాధించారని ప్రశ్నించారు. చంద్రబాబు–మోదీ జోడి రాజధాని నిర్మాణానికి చేసింది శూన్యమన్నారు. సింగపూర్‌ కంపెనీలు ఒక్క పని కూడా మొదలు పెట్టలేదన్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. టెండర్ల పిలిచి రాజధాని నిర్మాణాన్ని కూడా సంపాదనగా మార్చుకున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు ప్రజలకు సింగపూర్‌ పేరుతో అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారన్నారు.  రాజధాని నిర్మాణాన్ని చంద్రబాబు దోపిడీకి మార్గంగా ఎంచుకున్నారన్నారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులు ఎలా హస్తగతం చేసుకోవాలన్న ఆలోచనలో చంద్రబాబు,లోకేష్‌లు ఉన్నారన్నారు.అగ్రిగోల్డ్‌ ఆస్తుల విలువ తగ్గించి చూపుతున్నారన్నారు. అగ్రిగోల్డ్‌పై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. 
 
Back to Top