<strong>విశాఖపట్నంః</strong> రైతులకు వైయస్‌ఆర్‌సీసీ అండగా ఉంటుందని వైయస్‌ఆర్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు.విశాఖ జిల్లా గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతుల నిరసన సభలో ఆయన మాట్లాడారు.చెరుకు రైతులకు బకాయిలు చెల్లించకుండా రైతులను ఆవేదనకు గురిచేయడం దారుణమన్నారు. మొలసిస్ అమ్మకాల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. చెరకు రైతుల బకాయిలు చెల్లించిన తర్వాతే క్రషింగ్ మొదలుపెట్టాలన్నారు. చెరకు రైతుల సొమ్మును టీడీపీ నేతలు అడ్డగోలుగా దోచుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఎప్పడు ముఖ్యమంత్రి అయిన మొదటిగా రైతులే నష్టపోతారన్నారు. లాభాలో ఉన్న ఫ్యాక్టరీని అప్పులోకి ఊబిలోకి నెట్టారన్నారు.గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి 130 కోట్లు నష్టం ఎలా వచ్చిందని ప్రశ్నించారు.వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే విచారణ చేయిస్తామని హెచ్చరించారు.అన్నంపెట్టే రైతులను ఆవేదనకు గురిచేయొద్దన్నారు.రైతులు ఆత్మసై్థర్యం కొల్పోవద్దని వైయస్ జగన్ నాయకత్వంలో రైతు రాజు అవుతారన్నారు.వైయస్‌ఆర్ ఆశయంతో పుట్టిన పార్టీ వైయస్‌ఆర్‌సీపీ అని, మళ్లీ ఆయన రాజ్యం వస్తుందన్నారు.