బాబు ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయ్

అనంతపురం: చంద్రబాబు ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, ప్రజలు తగిన గుణపాఠం చెప్పే రోజులు తొందర్లోనే ఉన్నాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కళ్యాణదుర్గం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఉషాశ్రీ చరణ్‌ అన్నారు. నియోజకవర్గ పరిదిలోని బ్రహ్మసముద్రంలో ఉషాశ్రీ చరణ్‌ ఆధ్వర్యంలో ఇంటింటికీ వైయస్‌ఆర్‌ కుటుంబం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజన్న సువర్ణ పరిపాలన రావాలంటే అది జగనన్నతోనే సాధ్యమవుతుందన్నారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని బలపర్చేందుకు ప్రజలంతా కదలివస్తున్నారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ సీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Back to Top