బుచ్చెయ్యపేటః నవరత్నాలు పథకాల అమలుతోనే పేద ప్రజలు జీవితాలు బాగుపడతాయని జిల్లా వైయస్సార్ సీపీ సెక్రటరీ తమరాన రామకోటి తెలిపారు. వైయస్సార్ కుటుంబం కార్యక్రమంలో భాగంగా సోమవారం ఎల్‌బి పురం గ్రామంలో ఇంటింటికి తిరిగి నవరత్నాలు పథకాలు గురించి ప్రజలకు వివరించారు. ఆడ, మగ, రైతు, పేద, విదార్ధులు, నిరుద్యోగులు, చేతి వృత్తుల వారు అన్ని రంగాల వారిని దృష్టిలో పెట్టుకొని రాష్ట వైయస్సార్ సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాలు పథకాలను ప్రవేశపెట్టారన్నారు. టీడీపీ పాలన అంతమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, ఏడాది కాలంలో ఎన్నికలు వస్తున్నాయని వైయఎస్ తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి తప్పకుండా మనందరి ఆశీస్సులతో ముఖ్యమంత్రి అవుతారని నవరత్నాలు పథకాలు అమలుచేసి మన జీవితాలు బాగుచేస్తారన్నారు. పలువురు టీడీపీ పాలన వల్ల ఏ విధంగా మోసపోయింది వైయస్సార్సీపీ నాయకులు ఎదుట వాపోయారు. కొద్ది రోజులు ఓపిక పట్టండి మన జీవితాలు బాగుచేసుకుందామని వైయస్సార్సీపీ నాయకులు ప్రజలకు వివరించారు. పలువురి ఇళ్లకి వైయస్ స్టిక్కర్లును అంటించికున్నారు........................................................<strong>జోరుగా నవరత్న పథకాల ప్రచారం</strong>పాతపోస్టాఫీసు : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటికి వెళ్లి పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్న పథకాల విశిష్టతను ప్రచారం చేస్తున్నారు. ఇచ్చిన హమీలను నెరవేర్చకుండా టీడీపీ ప్రజలను ఎలా మోసం చేస్తుందో వివరిస్తున్నారు.22వ వార్డు అధ్యక్షుడు నొల్లు పోతురాజు ఆధ్వర్యంలో బీచ్‌రోడ్డు, ఫిషింగ్ హార్బర్, కొత్తఅగ్రహారం ప్రాంతాల్లో సుమారు 80 ఇళ్లను సందర్శించారు. కార్యక్రమంలో చంటి, కె.సురేష్, సతీష్, కాకరరాజు, ఆనంద్, శ్రీను, మహేష్, కనకరాజు తదితరులు పాల్గొన్నారు. 25వ వార్డు అధ్యక్షుడు సూరాడ తాతారావు ఆధ్వర్యంలో కురుపాంమార్కెట్, పెదశివాలయంవీధి, గాంధీపార్క్ ప్రాంతంలోని సుమారు 80 ఇళ్లను సందర్శించారు. కార్యక్రమంలో అర్జిల్ల మసేను, సూరి, ఆదినారాయణ, ఆప్పారావు, చంటి, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.............................................<strong>ప్రజా సంక్షేమమే లక్ష్యంగా నవరత్నాల పథకాలు</strong>కె.కోటపాడు : రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా వైయస్సార్‌సిపి అధ్యక్షుడు వై.యస్.జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాల పథకాలకు రూపకల్పన చేశారని పార్టీ మండల ప్రదాన కార్యదర్శి, సర్పంచ్ అవుగడ్డ సొంబాబు అన్నారు. లంకవానిపాలెం గ్రామంలో సోమవారం వైయస్సార్ కుటుంబం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో గల 60 ఇండ్లకు వెళ్ళి నవరత్నాల పథకాలను వివరించారు. జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే ఫించన్‌లను రూ.2వేలకు పెంచుతారని వివరించారు. కార్యక్రమంలో ఆయా కుటుంబాల వారి సెల్‌ఫోన్‌లతో 91210 91210కు మిస్డ్‌కాల్ ఇప్పించి పార్టీ సభ్యత్వాన్ని కల్పించారు. కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి అవుగడ్డ సుగుణ, పార్టీ గ్రామశాఖ అద్యక్షుడు బురుడు అప్పారావు, నౌడు స్వామినాయుడు, వేచలపు స్వామినాయుడు, కొరుపోలు అమ్మయ్యమ్మ, వేచలపు రమణ, గాడి అక్కునాయుడు, కిల్లాడ రోశయ్య తదితరులు పాల్గోన్నారు.<br/>