ఆత్మకూరుః అధికారం కావాలన్న అత్యాశతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో అమలు గానీ హామీలిచ్చి ప్రజలకు మోసం చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత పచ్చచొక్కాలకు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు. కాని రాష్ట్రాభివృద్ది కోసం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వైఎయస్ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాలను ప్రకటించారని ఆ నవరత్నాలే ... నవసమాజానికి నాంది అని వైయస్సార్‌సీపీ నాయకులు తెలియచేశారు . సోమవారం వైయస్సార్ కుటుంబంలో భాగంగా మండలంలోని తొపుదుర్తి , బి, యాలేరు , సనప, రంగంపేట, వేపచెర్ల గ్రామాల్లో ఇంటింటికి తిరిగి చంద్రబాబు ప్రజలకు చేసిన మోసాలను వివరించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశ పెట్టిన నవ త్నాలు భవిష్యత్ తరాలకు నాంది అని తెలియచేశారు . ఫోన్ ద్వారా 9121091210 కు ఫోన్ చేసి వైయస్సార్ కుటుంబంలో చేర్చారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్‌సీపీ భూత్ కమిటీ కన్వీనర్లు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.......................................<strong>గుత్తిలో ఇంటింటికి వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమం</strong>గుత్తి:గుత్తిలో సోమవారం వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమాన్నిఆ పార్టీ సీనియర్ నాయకులు , గుత్తి ఇన్‌చార్జ్ శ్రీనివాసరెడ్డి సమక్షంలో పట్టణ కన్వీనర్ పీరా, బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లయ్యాయాదవ్, జిల్లా కార్యదర్శులు గురు ప్రసాద్ యాదవ్, శివయ్య, రంగస్వామి, ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు వెంకటేష్, ఎస్సీ సెల్ నాయకులు అరటి పండ్ల చంద్ర, నాగభూషణం, సుధాకర్, ప్రసాద్, భీమన్న, హరి, రవి, ఎస్టీ సెల్ జిల్లా నాయకులు ఎస్‌ఎస్ నాయక్, మున్సిపల్ కౌన్సిలర్లు కళ్యాణి, నజీర్, వరలక్ష్మి, కమలాక్షమ్మ,కృపా సుజాత, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి మల్లికార్జున, రమేష్‌రెడ్డిల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇంటింటికి తిరిగి వైయస్ జగన్ ప్రవేశ పెట్టిన నవరత్నాల పథకం గురించి వివరించారు. గుత్తి, గుత్తి ఆర్‌ఎస్‌లో 1,3,8,14,15,18,19, 24 వార్డుల్లో వైయస్సార్ కుటుంబం(వనరత్నాలు) కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు నవరత్నాల గురించి ప్రజలకు వివరించారు. జగన్ ముఖ్యమంత్రి అయితే ప్రజలకు జరిగే ప్రయోజనాలను గురించి వివరించారు. ప్రజల నుంచి మంచి స్పందన లభించింది...................................................<strong>నవరత్నాలపై విసృతంగా ప్రచారం</strong>విడపనకల్లు: మండల కేంద్రంలోని బెస్త, బిసి,ఎస్సీ కాలనీలో వైయస్‌ఆర్ బూత్ కమిటీ కన్వీనర్లు,సభ్యులు సోమవారం నవత్నాలపై విస్తృతంగా ప్రచారం చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే పేదల అభివృద్ధి కోసం ప్రవేశ పెట్టబోయే నవరత్నాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. తెలుగు దేశం పార్టీ ప్రజలను, రైతులను, మహిళలను పూర్తిగా నమ్మించి మోసం చేసిందని, అలాంటి నాయకుల మాటలు నమ్మవద్దని సూచించారు. ఇంటింటికీ వెళ్లి వైయస్ఆర్ కుటుంబం స్టిక్కర్ అతికించారు. గడప గడపలో 9121091210 నెంబర్‌కు ఫోన్ చేయించి వైయస్‌ఆర్ కుటుంబలో సభ్యులు గా చేర్పించారు.ఈ కార్యకరమంలో బూత్ కమిటీ కన్వీనర్లు బి.సుంకన్న, నాగేంద్ర, రాజశేఖర్, బోయ వెంకటేశులు, తదితరులు పాల్గొన్నారు.<br/>