బుక్కపట్నం: నియొజకవర్గంలో వైయస్సార్ కుటుంబం కార్యక్రమం కొనసాగుతోంది. ఇంటింటికి వెళ్లి నవరత్నాల ప్రాధాన్యతను వివరించే కార్యక్రమంలో పలువురు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. వైయస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్లీనరీలో ప్రకటించిన నవరత్నాలను వైయస్సార్ కుటుంబం ద్వారా ప్రజలకు వివరించారు. ఈ పథకాలు అమలు కావాలంటే జగనన్నను సీఎం చేయాలని పిలుపునిచ్చారు.. ప్రతి కుటుంబ సభ్యులతో 91210 91210 నంబరుకు కాల్ చేయించి వైయస్సార్ కుటుంబంలో సభ్యులుగా చేర్పించారు. బుక్కపట్నంలో బోసే గంగాధర్, మాల్యవంతం మారుతి,మాజీ స్టోర్ డీలర్ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.<br/>