హోదాకు ‘ప‌చ్చ’ రంగు తూట్లు

- ప్ర‌త్యేక హోదా ఉద్య‌మాన్ని నీరుగార్చేందుకు బాబు అండ్ కో ప్ర‌య‌త్నాలు
-  క్యాస్టింగ్ కౌచ్ పేరుతో  స్పెషల్ స్టేటస్  డైవర్ట్ చేసే కుట్ర‌
- కోట్లాది మంది ఆంధ్రులను కన్‌ఫ్యూజన్‌లోకి నెట్టే ప్ర‌య‌త్నం  
- ప్ర‌త్యేక హోదా కోసం వైయ‌స్ జగన్ ఆలుపెరగని పోరాటం
అమ‌రావ‌తి: 
హోదా అంశాన్ని పక్కదారి పట్టించేందుకు కుట్ర జరుగుతుందా?. నాలుగేళ్లు ప్రజాపోరాటాన్ని నీరుగార్చడానికి   చంద్రబాబు అండ్ కో  ప్రయత్నిస్తున్నారా?. నమ్మి ఓట్లు వేసిన  కోట్లాది మంది భవిష్యత్తుతో ఆడుకోవాలని చూస్తున్నారా?. రాష్ట్ర భవిష్యత్తును  అధఃపాతాళంలోకి నెట్టేయాలని చూస్తున్నారా?. హోదాను అడ్డుకుని  ఏం సాధిద్దామని అనుకుంటున్నారు?. హోదా నినాదాన్ని పక్కదోవ పట్టించడానికి ఎందుకు రకరకాల విన్యాసాలు చేస్తున్నారు?. హోదా నినాదం పార్లమెంట్ సాక్షిగా ఢిల్లీలో పీక్‌ స్టేజ్‌కు వెళ్లినప్పుడు..టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ పేరుతో  స్పెషల్ స్టేటస్‌ను డైవర్ట్ చేయడానికి ఎందుకు ప్రయత్నించారు?. హోదా నినాదాన్ని వినబడకుండా చేయడానికి..ఏ పదాన్ని అయితే తెర మీదకు తెచ్చారో..ఆ పదమే ఇప్పుడు చంద్రబాబు అండ్‌ కోకు బుమరాంగ్ అయిందా?.  

ప్రజలను కన్నబిడ్డల్లాగా చూసుకోవాల్సిన పాలకులే..ఆ బిడ్డలకు  ఊపిరి అనుకునే హోదా గొంతు నొక్కేస్తున్నారు. ప్రజలు ఏమైపోతే మాకేం.. రాష్ట్రం ఏమై పోతేం మాకేం...హోదాతో మాకెందుకు..రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం..వచ్చే ఎన్నికల్లో గెలవడానికి  ఎన్ని   ఎత్తులైన వేయాలి. ఇది చంద్రబాబు అండ్‌ కో చేస్తున్న ఆలోచన. రాష్ట్రానికి అవసరమయ్యేవి..ప్రజలకు  ఉపయోగపడే వాటితో  చంద్రబాబు అండ్‌ కోకు అనవసరం.  బతకడానికి ఆక్సిజన్‌ ఎంత అవసరమో..విభజనతో అన్ని రకాలుగా నష్టపోయిన ఏపీకి హోదా  కూడా అంతే  అవసరమని చిన్న పిల్లాడిని అడిగిన చెబుతాడు.  అధికారంలోకి రాగానే హోదా అవసరమా అన్నట్లు చంద్రబాబు మాట్లాడటం ప్రారంభించారు  . హోదా సాధించకపోగా.. హోదా నినాదాన్ని పక్కదారి పట్టించాలని బాబు ఆయనకు మద్దతిచ్చే మీడియా  ఎందుకు ప్రయత్నిస్తుంది?. మొదటి నుంచి హోదాపై కప్పదాటు వ్యవహారశైలిని ప్రదర్శిస్తున్న  బాబు...ఇప్పుడు కూడా అదే వైఖరి అనుసరిస్తూ ఎందుకు ప్రజల గొంతు నొక్కుతున్నారు? . 

హోదా కోసం లోక్‌సభలో వైయ‌స్ఆర్‌ సీపీ 13  అవిశ్వాస తీర్మానాలు  ఇచ్చింది. హోదా కావాలంటూ  కోట్లాది మంది  రోడ్డెక్కారు. ఐదు  కోట్ల ఆంధ్రుల గొంతులో హోదా నినాదమే. ఎక్కడ చూసినా హోదాపైనే చర్చ.  విద్యార్ధులు, నిరుద్యోగులు, పారిశ్రామిక వేత్తలు, మహిళలు అందరూ హోదా గురించి చర్చించుకోవడం ప్రారంభించారు. చర్చించుకోవడమే కాదు..ప్ల కార్డులు పట్టుకుని  ఆకాశానికి చిల్లులు పడేలా  హోదా నినాదాలు చేశారు.  

వైయ‌స్ జగన్ ఆలుపెరగని పోరాటం..ప్రజా ఉద్యమాలతో గత్యంతరం లేని  పరిస్థితుల్లో హోదాపై యూటర్న్ తీసుకున్న చంద్రబాబు...చిత్తశుద్ధితో పోరాటం చేయకుండా ...పోరాటం చేసే వారిని అడ్డుకోవాలని అడుగడుగునా ప్రయత్నించారు.  నాలుగేళ్లుగా హోదా కోసం రకరకాల మార్గాల్లో పోరాటం చేస్తున్న వైయ‌స్ జగన్‌ను అన్ని విధాలుగా అడ్డుకున్నారు.   ఇక...హోదా కోసం విశాఖలో  క్యాండిల్  ర్యాలీలో పాల్గొనడానికి వెళ్తున్న  వైయ‌స్ జగన్‌ను ఎయిర్‌ పోర్టులోనే   అడ్డుకున్నారు. గుంటూరులో దీక్షను భగ్నం చేశారు. 
 

ఇంతటితో చంద్రబాబు ఆగలేదు..అవకాశం వచ్చిన ప్రతిసారి  ప్రత్యేక హోదాను తక్కువ చేసి చూపించడానికి ప్రయత్నించారు. తక్కువ చేసి మాట్లాడారు. హోదా ఉన్న ఈశాన్య రాష్ట్రాలు బాగుపడ్డాయా?. కోడలు మగ బిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా?.  హోదాలో ఉన్న ప్రయోజనాలు ప్యాకేజీలో ఉంటాయి?. ఇలాంటి  ప్రకటనలతో  రాష్ట్ర భవిష్యత్తుతో  చంద్రబాబు ఆడుకున్నారు..కోట్లాది మంది ఆంధ్రులను కన్‌ఫ్యూజన్‌లోకి నెట్టేశారు.   


హోదా కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని ప్రతిపక్ష నేత వైయ‌స్ జగన్ అనేకసార్లు టీడీపీ ప్రభుత్వానికి  విజ్ఞప్తి చేశారు.  చంద్రబాబు పట్టించుకోలేదు. కనీసం అఖిలపక్షం ఆలోచన కూడా చేయలేదు.  అంతా సొంత వ్యహహారంలా చంద్రబాబు ముందుకెళ్లారు.  వైయ‌స్ఆర్ సీపీ వరుసుగా అవిశ్వాసాలు పెట్టడం..రాజీనామాలు చేయడం..దీక్షకు దిగడంతో హోదా క్రెడిట్ ఎక్కడ వైయ‌స్ఆర్‌ సీపీకి పోతుందేమోనని.. చంద్రబాబు అఖిలపక్షమంటూ నాటకాలు మొదలు పెట్టారు.  

ఇక..వైయ‌స్‌ఆర్‌ సీపీ ఇచ్చిన పిలుపుతో ..హోదా సాధన సమితి, వామపక్షాలు స్పందించి బంద్‌లో పాల్గొన్నాయి. కోట్లాది మంది ప్రజలు స్వచ్ఛందంగా రోడ్డెక్కారు. దీన్ని అడ్డుకోవడానికి టీడీపీ ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు.  


అసెంబ్లీ సాక్షిగా వైయ‌స్ జగన్‌ గొంతు నొక్కినా..బంద్‌లు, ధర్నాలు, దీక్షలూ  అడ్డుకున్నా...బంగాళాఖాతం హోరులా హోదా నినాదాలు మారుమోగడం ఆగలేదు. ఇక్కడే..చంద్రబాబు అండ్ కో ఎత్తులకు పదును పెట్టడం ప్రారంభించారు.  హోదా నినాదం మీడియాలో వినపడకూడదు..కనపడకూడదు ఏం చేయాలి ?. ఏదో ఒకటి చేయాలి?. ఇక్కడే పచ్చ బుర్రలు పదును తేలాయి. క్యాస్టింగ్ కౌచ్ అనే పదాన్ని తమ అనుకూల మీడియా స్కీన్‌ల మీదకు తెచ్చారు. 

 తెలుగు రాష్ట్రాల్లో  సమస్యలు ఏం లేవనట్లు..చిత్రసీమ నుంచి నలుగురిని తీసుకొచ్చి మాట్లాడించారు. గంటలకు గంటలు తిట్టుకునేలా చేశారు.రచన, స్క్రిప్ట్ పచ్చ పెన్నులు రాసినట్లే వెళ్లింది. స్వకార్యం, స్వామి కార్యం రెండూ తీరుతాయని ఎల్లో మీడియా భావించినట్లుంది.  మెగా ఫ్యామిలీపై  బాణాలు ఎక్కి పెట్టింది.  కానీ..ఇక్కడే పచ్చ బుర్రలు అంచనా వేయని విధంగా బూమరాంగ్ అయింది. జన్మనిచ్చిన అమ్మను కూడా ఈ వివాదంలోకి లాగడంతో మెగా ఫ్యామిలీ భగ్గుమంది. పవన్ కల్యాణ్ తన ట్వీట్టర్‌లో విరుచుకుపడ్డారు.  

ఫిలించాంబర్‌లో పవన్ కల్యాణ్‌ నిరసన దీక్షకు దిగారు. ఫిలిం ఛాంబర్‌లో పవన్‌ అభిమానులు ఆందోళనకు దిగారు. హోదా  నినాదం పీక్‌కు వెళ్లినప్పుడల్లా... హోదా నినాదాన్ని కింద పడేయడానికి చంద్రబాబు ..ఆయనకు  మద్దతిచ్చే  మీడియా వేసే ఎత్తులు  ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇక..చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ ఎత్తులు  క్యాస్టింగ్‌  కౌచ్‌తో పరాకాష్టకు చేరుకున్నాయి. రాజకీయాలు చేయాలి.. ప్రజల కోసం చేయాలి. పదవులు కాపాడుకోవడానికి కాదనే విషయాన్ని చంద్రబాబు ఆయనకు మద్దతుగా నిలబడే మీడియా ఇప్పటికైనా గమనిస్తారని ఆశిద్దాం. 
Back to Top