ప్ర‌తి ఇంట్లో మంచి జ‌ర‌గాలి..ప్ర‌తి ఇంటికి మంచి చేయాలి



విజ‌య‌న‌గ‌రం:  రేపు మన పాలన చంద్రబాబు నాయుడి పాలన కన్నా భిన్నంగా ఉంటుంది. ఆయన వయసు 70 ఏళ్లు. ఆయనకు డబ్బు తప్ప ఎలాంటి ఆశ లేదు. కానీ నాకు 30 ఏళ్లు రాజకీయాల్లో కొనసాగాలనే ఆశ ఉంది. ప్రతిసారీ గెలవాలనే తలంపుంది. దేవుడి దయవల్ల, మీ అందరి చల్లని దీవెనల వల్ల అది జరుగుతుందనే నమ్మకం నాకుంది. అది జరగాలంటే ప్రతి ఇంట్లో మంచి జరగాలి. ప్రతి ఇంటికీ మంచి చేయాలి. ప్రతి రైతన్నకు తోడుగా నిలబడాలి. అలా చేసినప్పుడే నేను చనిపోయిన తర్వాత కూడా నాన్న ఫొటోతో పాటు నా ఫొటో కూడా పక్కన ఉంటుంది. ఆ పరిస్థితి తీసుకొచ్చేందుకు కృషి చేస్తాను. అందుకే ప్రతి ప్రాజెక్టును రైతన్నల కోసం చిత్తశుద్ధితో పూర్తి చేస్తాను. చంద్రబాబు మాదిరి లంచాల కోసం ఆరాటపడనని చెబుతున్నా. చిక్కటి చిరునవ్వులతో నాకు తోడుగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.   
Back to Top