తాడేపల్లి: ఏపీలో చిరు వ్యాపారుల పెట్టుబడి కోసం జగనన్న తోడు పథకాన్ని మహాత్తరంగా అమలు చేస్తోంది సీఎం వైయస్ జగన్ సర్కార్. ఇందులో భాగంగా నేడు(బుధవారం) చిరువ్యాపారుల కోసం వడ్డీలేని రుణం రూ.395 కోట్లు విడుదల చేయనుంది.క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి నగదును జమ చేయనున్నారు సీఎం వైయస్ జగన్. జగనన్న తోడు పథకంలో భాగంగా.. ఒక్కో వ్యాపారికి రూ.10వేల వరకు వడ్డీ లేని రుణం అందిస్తోంది సీఎం వైయస్ జగన్ ప్రభుత్వం. తద్వారా వాళ్ల జీవనోపాధికి అండగా నిలుస్తోంది. తాజా రుణం జారీతో 3.95 లక్షల మంది చిరువ్యాపారులకు లబ్ధి చేకూరనుంది. గత ఆరు నెలలకు సంబంధించి రూ.15.17 కోట్లు వడ్డీ రీయింబర్స్‌మెంట్ అందించనుంది. జగనన్న తోడు పథకం కింద ఇప్పటివరకు రూ.15,31,347 మందికి రూ.2,406 కోట్లు వడ్డీ లేని రుణాలు అందాయి.