చంద్రబాబు నాటిన విత్తనం చేబ్రోలు కిరణ్

రెండేళ్లుగా తీవ్ర పదజాలంతో మాట్లాడితే కనిపించలేదా?

ఆగ్రహం వ్యక్తం చేసిన అంబటి రాంబాబు, అప్పిరెడ్డి

గుంటూరు :  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సతీమణిపై అసభ్య వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ చంద్రబాబు నాటిన విత్తనం అని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిప‌డ్డారు.  దానికి లోకేశ్ నీళ్లు పోసి పెంచారని పేర్కొన్నారు. "కిరణ్ అనుచిత పదజాలంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజానీకం భగ్గుమంది. దీంతో చంద్రబాబు తన ఇమేజ్ డ్యామేజ్ కాకుండా అతడిని బలి చేస్తున్నారు. రెండేళ్ల నుంచి కిరణ్ వైయ‌స్ఆర్‌సీపీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నా ఎందుకు స్పందిం చలేదు?" అని ప్రశ్నించారు. కిరణ్ను గుంటూరు ఎస్పీ వద్దకు తీసుకెళ్తుండగా అడ్డగించే ప్రయత్నం చేసిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను పోలీసులు నగరం పాలెం స్టేషన్కు తరలించారు. దీంతో రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ నాయకులు లీగల్ బృందంతో కలిసి స్టేషన్‌కు వచ్చారు. వీరు గోరంట్ల మాధవ్ను కలవనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. కొంతసేపటికి మాధవ్ను స్టేషన్ వెనుక నుంచి వేరే స్టేషన్‌కు తరలించారు. ఈ విషయంపై వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ కె.అరవింద్‌ను అంబటి ప్రశ్నించారు. మాధవ్‌ను చూపించాల్సిందేనని పట్టుబట్టారు. అనంతరం స్టేషన్ బయట విలేకరులతో మాట్లాడారు. మాధవ్ను దొడ్డిదారిన ఎక్కడికి తీసుకెళ్లారని ప్రశ్నించారు. ఆయన ఎక్కడున్నారో చెప్పడం లేదన్నారు.

పోలీసుల అదుపులో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్

వైయ‌స్ఆర్‌సీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను గుంటూరు నగరంపాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చేబ్రోలు కిరణ్ను గుంటూరు తరలిస్తుండగా మాధవ్ అనుసరించి అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో గుంటూరు జిల్లా పోలీసు కార్యాలయం వద్ద నగరంపాలెం పోలీసులు మాధవ్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం డీపీవో కార్యాలయంలోకి తీసుకెళ్లి విచారిం చారు. అక్కడినుంచి నగరంపాలెం స్టేషన్‌కు మాధ‌వ్‌ను తరలించి విచారిస్తున్నారు.

Back to Top