కర్నూలు జిల్లా: ఆదోని పురపాలక ఛైర్‌పర్సన్ పదవిని అడ్డదారిలో దక్కించుకోవాలన్న టీడీపీ కూటమి పార్టీల కుట్రలను వైయస్ఆర్‌సీపీ చిత్తు చేసింది. ఆదోని మున్సిపల్ చైర్ పర్సన్ శాంత ఒంటెద్దు పోగోడకు వ్యతిరేకిస్తూ , వార్డుల అభివృద్ధిలో సహకరించడం లేదని ఆమెకు వ్యతిరేకంగా వైయస్ఆర్‌సీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. కలెక్టర్ ఆదేశాలతో సబ్ కలెక్టర్ మోరియా భరద్వాజ్ ఇవాళ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టగా మున్సిపల్ చైర్ పర్సన్ శాంత కు వ్యతిరేకంగా 35 మంది కౌన్సిలర్లతో పాటు ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ కలుపుకుని 36 మంది ఓటు వేయడంతో వైయస్ఆర్‌సీపీ నెగ్గింది. మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాదరెడ్డి నేతృత్వంలో ఆదోని మున్సిపల్ చైర్మన్ పదవిని వైయస్ఆర్‌సీపీ నిలుపుకోవడంతో కూటమి నేతలు భంగపడ్డారు. ఊపిరి ఉన్నంత వరకు వైయస్ఆర్‌సీపీలోనే ఎమ్మెల్యే ప్రలోభాలతో బీజేపీలో చేరిన 11, 12వ వార్డుల కౌన్సిలర్లు మాజీ ఎమ్మెల్యే వై.సాయిప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్ సమక్షంలో తిరిగి వైయస్ఆర్‌సీపీ గూటికి చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇకపై ఊపిరి ఉన్నంత వరకు వైయస్ఆర్‌షీపీ లోనే కొనసాగుతానన్నారు. సాయిప్రసాద్‌రెడ్డి అడుగుజాడల్లోనే నడుస్తానన్నారు. వార్డులో పెద్దల మాటలను గౌరవించి, జరిగిన పొరపాటు తెలుసుకొని తిరిగి సాయన్న సమక్షంలో పార్టీలోకి వచ్చామన్నారు. 2029లో వైయస్ఆర్‌సీపీ గెలుపే లక్ష్యంగా తన వంతు కృషి చేస్తానన్నారు. కూటమి నేతలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. వార్డుల్లో అభివృద్ధి పనులు చేయిస్తామని ఆశ పెట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి పది నెలలు పూర్తయినా రూ.10 పని కూడా చేయలేదు. బీజేపీలో చేరడం వల్ల చీవాట్లు తప్ప ఏమీ ఒరగలేదని కౌన్సిలర్ వాసీం అన్నారు. కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టు: పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి ఆదోని మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానంలో వైయస్ఆర్‌సీపీ నెగ్గడం కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టు అని కర్నూలు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. అవిశ్వాసంలో విజయం సాధించిన కౌన్సిలర్లు, మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి ఆయన అభినందనలు తెలిపారు. వైయస్ఆర్‌సీపీలో ఉంటూ కూటమి ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్న చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం పెట్టి దింపడం ఇదొక చరిత్ర అన్నారు. ఈ ఓటమి కూటమి ప్రభుత్వానికి హెచ్చరికలాంటిదన్నారు. ఈ ప్రభుత్వానికి కౌంట్ ఆదోని నుంచి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయిందన్నారు. రాష్ట్రంలోని పలు స్థానిక సంస్థల్లో కూటమి ప్రభుత్వానికి బలం లేకున్నా, దౌర్జన్యంగా డబ్బులకు ప్రలోభ పెట్టి చైర్మన్ లు , వైస్ చైర్మన్ పదవులు గెలుస్తున్నారని, కర్నూల్ జిల్లా లో కూటమి నేతల పప్పులు ఉడకలేదని ఎస్వీ మోహన్ రెడ్డి కామెంట్ చేశారు.