వైయ‌స్‌ఆర్‌సీపీ శ్రేణులపై దాడులు పెరిగాయి

రాష్ట్రపతికి అరకు ఎంపీ తనూజారాణి ఫిర్యాదు

అరకు కాఫీ రైతుల బాగు కోసం గిరిజన కాఫీ సొసైటీ స్థాపించాల‌ని విజ్ఞ‌ప్తి

న్యూ ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడగానే వైయ‌స్‌ఆర్‌సీపీ నేతలపై వేధింపులు ఎక్కువయ్యాయని అరకు ఎంపీ తనూజారాణి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫిర్యాదు చేశారు. మంగళవారం ఆమె రాష్ట్రపతిని కలిశారు.  15 నిమిషాల పాటు రాష్ట్రపతితో తనూజారాణి భేటీ అయ్యారు.  

 వైయ‌స్‌ఆర్‌సీపీ సానుభూతిపరులు, నాయకులు, కార్యకర్తలపై  భౌతిక దాడులు, ఆస్తుల విధ్వంసాలతో రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయన్నారు.  జీవో నెంబర్ 3 పునరుద్ధరించాలని లేదంటే ప్రత్యేక చట్టం ద్వారా  గిరిజన ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్ని స్థానిక గిరిజనులకే కేటాయించాలి రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు.  

అరకు కాఫీ రైతుల బాగు కోసం గిరిజన కాఫీ సొసైటీ స్థాపించాలని, ఈ సొసైటీ ద్వారా కాఫీ కొనుగోలు చేస్తే రైతులకు గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఉందని రాష్ట్రపతి దృష్టికి  తీసుకువచ్చారు.

 

 

Back to Top