ప్రభుత్వ ఆసుపత్రులను  బాగు చేస్తాం

సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

ప్రతి ఆసుపత్రిలో కూడా మందుల కొరత లేకుండా చర్యలు

నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో నాణ్యతా ప్రమాణాలు ఉండాలి

వచ్చే మే నాటికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, నర్స్‌ పోస్టుల భర్తీ 

 

అమరావతి: నాడు-నేడు కార్యక్రమం కింద ప్రభుత్వ ఆసుపత్రులను బాగు చేస్తామని సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో నాడు- నేడు కార్యక్రమంపై సీఎం సమీక్ష నిర్వహించారు. సబ్‌ సెంటర్లు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా, జిల్లా ఆసుపత్రులు, బోధనాస్పత్రులను బాగు చేస్తామని సీఎం వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు.ప్రతి ఆసుపత్రిలో కూడా మందుల కొరత లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. 510 రకాలకు పైగా మందులు ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచాలని సూచించారు. డిసెంబర్‌ 15 నుంచి మందులు అందుబాటులో ఉంటాయన్నారు. నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో నాణ్యతా ప్రమాణాలు ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ప్రమాణాలు పెరగాలని సూచించారు. వచ్చే మే నాటికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, నర్స్‌ పోస్టుల భర్తీకి జనవరిలో క్యాలెండర్‌ ఇవ్వాలని ఆదేశించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షకు మంత్రులు ఆళ్లనాని, ఆదిమూలపు సురేష్‌, అధికారులు హాజరయ్యారు.  

Read Also: విద్యారంగ సంస్థలను బాగు చేస్తాం

Back to Top