ఏంటీ దౌర్జ‌న్యం..రాజకీయాల్లో తప్పుడు సంప్రదాయాలు తీసుకొస్తారా?

 
వైయ‌స్ఆర్‌సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి

రాయచోటిలో వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో మంత్రులు, టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యంగా ప్రవేశించారు

అధికార టీడీపీ రాజకీయాల్లో దుర్మార్గపు సంప్రదాయాలను తీసుకువస్తోంది, ఇది మంచి పద్ధతి కాదు

పార్టీ కార్యాలయాలకు జీవో ఇచ్చింది చంద్రబాబే అన్న విషయాన్ని మరిచిపోతే ఎలా?

రాష్ట్రవ్యాప్తంగా టీదీపీ కట్టుకున్న రాజమహల్‌లు ప్రజల కళ్లముందే ఉన్నాయి

చంద్రబాబు జారీచేసిన ఆ జీవో ఆధారంగానే స్థలాల కేటాయింపులు జరిగాయి

రాయచోటిలోకూడా పార్టీ కార్యాలయంకోసం ఈ జీవో ఆధారంగా స్థలం కేటాయించారు

ప్రజలకు ఇబ్బందిలేని ప్రాంతంలో స్థలం కేటాయించారు

రాయచోటి పార్టీ కార్యాలయానికి సంబంధించి అత్యంత జవాబుదారీతనంతో వ్యవహరించాం

ఈ అంశంపై అధికారులు సహా, ఎవరికైనా పూర్తి సమాచారం ఇవ్వడానికైనా, వారితో మాట్లాడేందుకైనా నేను సిద్ధంగా ఉన్నాం

రాయచోటి పార్టీ ఆఫీసు నిర్మాణానికి సంబంధించి అన్ని పత్రాలను ప్రజల ముందు ఉంచుతున్నాను

రాయచోటి:  రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చిన టీడీపీ ప్ర‌భుత్వం దౌర్జ‌న్యం చేయ‌డం దుర్మార్గ‌మ‌ని, వైయ‌స్ఆర్‌సీపీ కార్యాల‌యాల్లోకి  టీడీపీ నేత‌లు వ‌చ్చి దురుసుగా ప్ర‌వ‌ర్తించ‌డం ఏంట‌ని, రాజకీయాల్లో తప్పుడు సంప్రదాయాలు తీసుకొస్తురా అని వైయ‌స్ఆర్‌సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి మండిప‌డ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వంలో ఉన్నా.. ప్రతిపక్షంలో వున్నా.. పదవీ వున్నా లేకున్నా జవాబు దారితనం ప్రతి ఒక్కరికీ ఎవరికైనా ఖచ్చితంగా వుండాలని  వైయ‌స్ఆర్ సిపి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు.2016 జూలై 21 వ తేదీన  తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోజి ఓ  నెంబరు 340  ఇచ్చారని, ఆ జి ఓ ప్రకారం 50 శాతంకుపైగా సీట్లను గెలుచుకున్న పార్టీ కోసం ప్రతి జిల్లా కేంద్రంలో  పార్టీ కార్యాలయం కోసం 2 ఎకరాల స్థలాన్ని కేటాయించు కోవచ్చునని, 33 ఏళ్ల కుగాను  ఏడాదికి ఎకరానికి రూ వెయ్యి చొప్పున లీజు చొప్పున చెల్లించాలని  అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ జిఓ లో పొందుపరిచారన్నారు. 

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత వైయ‌స్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక , రాయచోటి జిల్లా కేంద్రం అయిన తరువాత పార్టీ విజ్ఞప్తి మేరకు 2022లో రాయచోటి లో పార్టీ కార్యాలయానికి 2 ఎకరాల స్థలాన్ని కేటాయింపు చేయాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేయడం జరిగిందన్నారు. అప్పటి ప్రభుత్వం ఇచ్చిన జీఓ ప్రకారం గౌరవ అధికారులు  ఇప్పుడు కట్టిన టీటీడీ కళ్యాణ మండపం, హైవే ని అనుకుని ఉన్న శిల్పారామం కడుతున్న స్థలం, కలెక్టర్ బంగ్లా వద్ద స్థలాలను తమకు చూపించడం జరిగిందన్నారు. ఇవి తమ దృష్టికి వచ్చినప్పుడు అవి ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయన్న ఉద్దేశ్యంతో వాటిని వద్దని చెప్పామన్నారు. పార్టీ కార్యాలయ అవసర నిమిత్తం కోసం ప్రజా అవసరాలకు ఉపయోగపడే స్థలం కాకుండా ఒక మూలన వుండే స్థలాన్ని కేటాయించాలని కోరామన్నారు. అప్పుడున్న తహసీల్దార్ రింగ్ రోడ్డుకు  ఒక మూలన, దూరంగా ఉన్న1.60 ఎకరాల విస్తీర్ణాన్ని కేటాయించారన్నారు. ఇది అనువైన స్థలం కాదని నిర్మాణం చేపట్టిన సంస్థ వారు తనకు తెలిపినా, ఇంతకన్నా మంచి స్థలం ఇవ్వడం జరగదని తాము చెప్పారన్నారు. 

2016లో తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన జిఓ మేరకు 2022 లో ఇచ్చిన జిఓ ప్రకారంగా గౌరవ జిల్లా కలెక్టర్  ప్రొసీడింగ్స్, అడ్వాన్స్ పొజిషన్, పంచాయతీ తీర్మానం తదితర వివరాల పత్రాలను జతపరుస్తున్నామన్నారు. ఆ రోజున ఇప్పుడు టి టి డి కల్యాణ మండపం కట్టిన స్థలాన్ని కానీ, ఇప్పుడు  శిల్పారామం కడుతున్న స్థలాన్ని కానీ, ఇప్పుడు కడుతున్న కలెక్టర్ బంగ్లా కడుతున్న స్థలాల కేటాయింపులకు ఎటువంటి ఆటంకాలు లేని పరిస్థితులలో కూడా, ఎప్పటికైనా జవాబు దారితనం ఉండాలన్న ఉద్దేశ్యంతో  రహదారి సౌకర్యం లేని, అనువుగా లేని స్థలాన్ని పార్టీ కార్యాలయం కోసం తీసుకోవడం జరిగిందన్నారు. 

తాను జిల్లా పార్టీ అధ్యకుడుగా ఉన్నందున దీనిపైన ఎటువంటి సమాధానాలు కావాలన్నా  జవాబుదారీతనంగా వుంటానన్నారు. దీనికి సంబంధించి కడప అర్బన్ డెవలెప్మెంట్  అథారిటీ లో డ్రాయింగ్ అప్రూవల్స్ అయిపోయాయన్నారు. అధికారులకు కానీ, ప్రజా ప్రజా ప్రతినిధులకు వీటిపైన ఎటువంటి అపోహలున్నా,అభ్యంతరాలున్నా తాము ఖచ్చితంగా నివృత్తి చేస్తామన్నారు. లేదు
కక్షపూరితంగా భవనాన్ని కూల్చాలని వ్యవహరిస్తే న్యాయస్థానాన్నిఆశ్రయిస్తామన్నారు. అధికారంలో తామూ ఏ రోజూ స్వార్థపూరితంగా వ్యవహరించలేదన్నారు. జవాబుదారితనం కోరుకునే వ్యక్తులలో తానొకడినన్నారు. 

జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు దీనిపైన ఇందుకు సంబందించిన డాక్యుమెంట్లును అధికారులకు సమర్పించడం జరిగిందన్నారు.  అవసరమైతే నేరుగా కలసి పూర్తి ఆధారాలతో అధికారులకు వివరించేందుకు సిద్ధముగా ఉన్నామన్నారు. వందల కోట్లు విలువ ఉన్న ప్రభుత్వ స్థలాలలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో  నిర్మించిన పార్టీ కార్యాలయాల నిర్మాణాలపైన ఆలోచనలు చేయాలన్నారు.

విజయవాడలో 8 అంతస్తుల భవనం, 13 జిల్లాల కేంద్రాలలో పూర్తి స్థాయిలలో ప్యాలెస్ లు కట్టుకున్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గుర్తెరగాలన్నారు. హైదరాబాద్  నడిబొడ్డున జూబ్లీహిల్స్ లో వందల కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని నిర్మించిన సాంప్రదాయాన్ని మీరు నేర్పించేదే కదా అని అన్నారు.
వైయ‌స్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలోని పార్టీ కార్యాలయాల భవన నిర్మాణాలకు ప్రభుత్వ నిధులు ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని, పార్టీ సంబంధంతోనే నిర్మించడం జరిగిందని శ్రీకాంత్ రెడ్డి వివరించారు. 

నేడు రాయచోటిలో పార్టీ కార్యాలయ నిర్మాణంలోకి మంత్రులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రవేశించడం దౌర్జన్యమేనన్నారు. రాజకీయాల్లో తప్పుడు సంప్రదాయాలు తీసుకొస్తున్నారన్నారు. పార్టీ కార్యాలయ నిర్మాణానికి సంబంధించిన తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇచ్చిన జిఓ, అలాగే స్కెచ్, పంచాయతీ తీర్మానం,అడ్వాన్స్  పోసిజన్, కలెక్టర్ ప్రొసీడింగ్స్, లీజు పేమెంట్స్ ,బిల్డింగ్ అప్రూవల్స్ కోసం దరఖాస్తు, వాటర్ బాడీకి సంబంధం లేదని ఇరిగేషన్ లెటర్, వారు ఇచ్చిన నోటీసు, నోటీసు కు రిప్లై తదితర వివరాల డాక్యుమెంట్లును ప్రజల ఎదుట ఉంచుతున్నామని శ్రీ‌కాంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Back to Top