ఘ‌నంగా రైతు దినోత్స‌వం

క‌డ‌ప ఎయిర్ పోర్ట్ లోవైయ‌స్‌ జగన్ కు నాగలి బహుకరించిన పార్టీ నేత‌లు, రైతులు

వైయ‌స్ఆర్ జిల్లా:  దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని రైతుసంక్షేమం కోసం 2019వ సంవ‌త్స‌రంలో అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డివినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.  రైతు పక్షపాతి అయిన వైయ‌స్‌ రాజశేఖర్ రెడ్డి గుర్తింపుగా రైతు దినోత్సవం నిర్వహించాలని నిర్ణ‌యం తీసుకుంది. ఐదేళ్ల పాటు ఏపీలో రైతు దినోత్స‌వాన్ని వైయ‌స్ఆర్ జ‌యంతి సందర్భంగా నిర్వ‌హించారు. ఇవాళ మ‌హానేత వైయ‌స్ఆర్ 75వ జ‌యంతిని పుర‌స్క‌రించుకొని వైయ‌స్ఆర్ జిల్లాలో రైతు దినోత్స‌వాన్ని ఘ‌నంగా నిర్వ‌హించారు. అలాగే రాష్ట్ర‌వ్యాప్తంగా వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు రైతు దినోత్స‌వాన్ని నిర్వ‌హించి, వైయ‌స్ఆర్ వ్య‌వ‌సాయ రంగానికి చేసిన మేలుల‌ను గుర్తు చేసుకుంటున్నారు.  రైతు దినోత్సవం సందర్భంగా కడప ఎయిర్ పోర్ట్ లో వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డికి వైయ‌స్ఆర్‌సీపీ రైతు విభాగం నాయ‌కులు, రైతులు, పార్టీ నాయ‌కులు నాగలి బహుకరించారు. 

రాష్ట్ర వ్యాప్తంగా రైతు దినోత్సవం..!! 
 దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా సోమ‌వారం రాష్ట్రవ్యాప్తంగా రైతు దినోత్సవాన్నివైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారు.  రైతు సాధికారత కోసం కృషి చేసిన వైయ‌స్ఆర్‌ సేవలకు గుర్తింపుగా ఆయన జయంతిని వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం రాష్ట్ర రైతు దినోత్సవంగా నిర్వహించింది.  అప్ప‌ట్లో ఐదేళ్ల పాటు రైతు దినోత్సవ సందర్భంగా అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు జరిగాయి.      

Back to Top