రైతులను చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదు

మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి

విపత్తుల సమయంలో వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచింది

చంద్రబాబు పిచ్చి కూతలు.. రామోజీ చెత్త రాతలు

ఎవరి హయాంలో రైతులకు మేలు జరిగిందో బహిరంగ చర్చకు నేను సిద్ధం మంత్రి కాకాణి 

నెల్లూరు: రైతులను చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేద‌ని మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి మండిప‌డ్డారు. వ్యవసాయాన్ని కించపరిచేలా మాట్లాడిందే చంద్రబాబు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు. 14 ఏళ్లలో వ్యవసాయానికి చంద్రబాబు తీసుకున్న చర్యలు ఏంటీ?. రైతులను చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదు. విపత్తుల సమయంలో వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచింది. విపత్తు కాలంలో రైతాంగానికి అన్ని విధాలా అండగా నిలిచాం. విపత్తుల సమయంలో రైతులకు చంద్రబాబు ఇచ్చిందేమిటీ?. చంద్రబాబు కూతలు కూస్తుంటే రామోజీ రాతలు రాస్తున్నారు. రైతులకు మంచి చేస్తున్న ప్రభుత్వంపై చంద్రబాబు, రామోజీ విషం చిమ్ముతున్నారు.   

రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి  ఇంకా ఏమన్నారంటే...

 వ్యవసాయాన్ని కించపరిచేలా మాట్లాడిందే చంద్రబాబే
మిగ్‌జాం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. సాయంపై సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేయటమే కాకుండా ప్రభావిత ప్రాంతాల్లోనూ పర్యటించి రైతులకు భరోసా ఇచ్చారు. ఇదే సమయంలో గత రెండు రోజులుగా చంద్రబాబు కూడా పర్యటనలు చేశాడు. తుపాను విషయంలో ప్రభుత్వం ఎక్కడ ఏవిధంగా విఫలమైందో చంద్రబాబు స్పష్టంగా చెప్పలేకపోయాడు. చంద్రబాబు మైక్‌ తీసుకుని ప్రభుత్వంపై బురద చల్లేలా ఆరోపణలు చేస్తున్నారు. 

వ్యవసాయానికి చంద్రబాబు తీసుకున్న చర్యలు ఏమిటో చెప్పగలరా?
సీఎంగా చంద్రబాబు 14 ఏళ్లు పనిచేశారు. 14 ఏళ్లలో అన్నదాతలకు చంద్రబాబు చేసిన మేలు ఏమిటి? పైగా వ్యవసాయాన్ని కించపరిచేలా మాట్లాడిందే చంద్రబాబే. వ్యవసాయం దండగ, ఉచిత విద్యుత్ ఇస్తే.. బట్టలు ఆరేసుకోవాలన్న వ్యక్తి చంద్రబాబు. రైతులు సమస్యలు చెప్పుకోవటానికి వెళ్తే బుల్‌డోజర్‌లతో తొక్కించాలన్న వ్యక్తి చంద్రబాబు. అంతేకాదు రైతులను చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదు. 

ప్రజలకు, రైతులకు భరోసా కల్పించిన సీఎం  వైఎస్ జగన్‌
తుపాను ప్రభావానికి గురైన తిరుపతి జిల్లాలోని స్వర్ణముఖి బ్యారేజ్‌, బాలిరెడ్డి గ్రామస్తులతో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖాముఖి చర్చించారు. బాపట్లలోనూ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి రైతులకు భరోసా ఇచ్చారు. సీఎం జగన్ పర్యటించిన రోజునే చంద్రబాబు కూడా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో కార్యక్రమం ప్రారంభించారు. అయితే తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వ వైఫల్యం ఇదని చంద్రబాబు చూపించలేకపోయాడు. దానికి కారణం తుపాను వల్ల నష్టపోయిన ప్రతి ఒక్క రైతునూ ఆదుకున్న ప్రభుత్వం ఇది. ఆయన చూపించడానికి అక్కడ ఎటువంటి పొరపాట్లు లేవన్నది సుస్పష్టం. విపత్తు సమయంలో రాజకీయాలకు అతీతంగా ప్రజలకు అండగా ఉండాలి. సాయం చేయకుండా కేవలం ప్రెస్‌మీట్లకు మాత్రమే చంద్రబాబు, టీడీపీ నాయకులు పరిమితం అయ్యారు. ఇదీ టీడీపీ నాయకుల వైఖరి.  

చంద్రబాబు యాక్షన్..రామోజీ డైరెక్షన్‌
నిజానికి, విపత్తుల సమయంలో రైతులకు చంద్రబాబు ఇచ్చిందేమిటీ? చంద్రబాబు కూతలు కూస్తుంటే రామోజీ రాతలు రాస్తున్నారు. రైతులకు మంచి చేస్తున్న ప్రభుత్వంపై చంద్రబాబు, రామోజీ విషం చిమ్ముతున్నారు. ఒకరు యాక్షన్ మరొకరు డైరెక్షన్ చేస్తున్నారు. గతంలో రైతులను చంద్రబాబు అవమానకరంగా మాట్లాడారు.. వ్యవసాయం దండగ అన్నారు. చంద్రబాబు తాను పరిహారం ఎక్కువగా ఇచ్చామని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాడని మంత్రి కాకాణి మండిపడ్డారు. 

ఫొటోలకు ఫోజులు ఇవ్వడం చంద్రబాబు నైజం
ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంటే చంద్రబాబుకు కడుపు మంట. ఫొటోలకు ఫోజులు ఇవ్వడం చంద్రబాబు నైజం.. ప్రజలతో మమేకమయ్యే నాయకుడు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. చంద్రబాబు హయాంలో ఏమైనా ఆయకట్టు సాగు పెంచారా? ప్రకృతి విపత్తుల్లో రైతులకు నష్టం జరిగితే.. రైతులు ఎవరైతే బీమా ప్రీమియం కడితారో వారికి ప్రభుత్వ వాటా చెల్లిస్తానని చెప్పి బీమా రాకుండా రైతులను చంద్రబాబు ముంచారు. ఈరోజు రైతు పంట వేసుకుంటే.. నోటిఫై పంటలకు ఈక్రాప్‌ బుకింగ్ చేయించి పారదర్శకంగా వారికి సంబంధించిన బీమా ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోంది. వైఎస్ఆర్‌ ఉచిత పంటల బీమా చంద్రబాబు హయాంలో లేదు. చంద్రబాబు వేల కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ బకాయిలు పెట్టారు. రైతుల కోసం చంద్రబాబు ఏనాడైనా మేలు చేశారా? ఎప్పుడు చూసినా ఐటీ గురించి మాట్లాడారు తప్ప రైతులను పట్టించుకున్నారా? టీడీపీ హయాంలో విత్తనాలు కోసం క్యూ లైన్‌లో నిలబడి రైతులు ప్రాణాలు కోల్పోయిన సంగతి రాష్ట్రంలోని రైతులు ఎవ్వరూ మర్చిపోలేదు. 

ప్రభుత్వంపై బురద జల్లేందుకు చంద్రబాబు ప్రయత్నం
వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంపై చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేస్తూ బురద జల్లేందుకు ప్రయత్నం చేస్తున్నారని మంత్రి కాకాణి మండిపడ్డారు. గతంలో టీడీపీ పాలన కాలంలో ఏనాడైనా రైతులను పట్టించుకున్నారా అని ప్రశ్నించారు.ఆర్‌బీకేలు ఏనాడైనా పెట్టారా? అగ్రికల్చర్ అసిస్టెంట్లు ద్వారా పంటల నష్టం తయారు చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో ఎవరికి ఎంత ఇస్తున్నారో తెలియకుండా ఏదో ఒకరోజు ఇంత ఇచ్చామని చేతులు దులుపుకోవటం లేదు. ఎవరికి పంట నష్టం జరిగిందో రైతు భరోసా కేంద్రాల్లో ప్రచురిస్తారు. ఆ వివరాలు ప్రచురించిన తరువాత వాటిలో అభ్యంతరాలు ఉంటే.. వాటిని పరిగణలోకి తీసుకుని బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. కేంద్రం నోటిఫైట్‌ చేయని పంటలకు కూడా జగన్ మోహన్ రెడ్డి మద్దతు ధర ప్రకటించటం జరిగింది. కందిపప్పుకి, పెసర పప్పుకి తేడా తెలియని వ్యక్తి నారా లోకేశ్‌. 

బహిరంగ చర్చకు సిద్ధమా చంద్రబాబూ..?
విపత్తుల సమయంలో వైఎస్ జగన్ గారి ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతులకు అండగా నిలిచింది. ఈ క్రమంలోనే రైతులకు చేసిన మేలుపై, వారికి అందిన లబ్ధిపై చంద్రబాబుతో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు ఏ మాత్రం నిజాయతీ ఉన్నా ఎవరెవరు రైతులకు ఎంత మేలు చేశారో బహిరంగ చర్చకు సిద్ధమని కాకాణి ఛాలెంజ్ చేశారు. తేదీ, సమయం, స్థలం, చంద్రబాబు ప్రకటిస్తే.. చర్చకు సిద్ధమని కాకాణి అన్నారు. 

విపత్తు సమయంలో ప్రజలకు అండగా వైయ‌స్‌ఆర్‌సీపీ ప్రభుత్వం
మిగ్‌జాం తుపానుపై రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు యుద్ధప్రాతిపదికన స్పందించారు. ప్రజాప్రతినిధులు అందరూ ప్రజలకు సకాలంలో సేవలు అందించారు. పునరావాస శిబిరాలకు తరలింపు నుంచి అవసరమైన వసతి సౌకర్యాలు అన్నీ కల్పించటం జరిగింది. జన జీవనానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సజావుగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవటం జరిగింది. విపత్తు కాలంలో రైతాంగానికి అన్ని విధాలా అండగా నిలిచాం. సమస్యాత్మక గ్రామాలను ముందుగానే గుర్తించి తగిన ఏర్పాట్లు చేపట్టగలిగాం. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశాం. విద్యుత్ విషయంలో అపారమైన నష్టం జరిగినా యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ చేపట్టాం.

రాష్ట్రంలో తుపాన్‌, వరదల నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు సకాలంలో స్పందించారు. సమస్యాత్మక గ్రామాలను ముందుగానే గుర్తించి తగిన ఏర్పాట్లు చేపట్టగలిగాం. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశాం. విద్యుత్ విషయంలో అపారమైన నష్టం జరిగినా యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ చేపట్టాం. గత రెండు రోజులుగా చంద్రబాబు పర్యటనలు చేస్తున్నారు. ఎక్కడా ప్రభుత్వం ఏవిధంగా విఫలమైందో స్పష్టంగా చెప్పలేక పోయారు. గతంలో రైతులను చంద్రబాబు అవమానకరంగా మాట్లాడారు.. వ్యవసాయం దండగ అన్నారు. మేము పరిహారం ఎక్కువగా ఇచ్చామని అవాస్తవాలు మాట్లాడుతున్నారు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంటే చంద్రబాబుకు కడుపు మంట.

ఫొటోలకు ఫోజులు ఇవ్వడం చంద్రబాబు నైజం.. ప్రజలతో మమేకమయ్యే నాయకుడు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి. టీడీపీ హయాంలో విత్తనాలు కోసం క్యూ లైన్‌లో నిలబడి రైతులు ప్రాణాలు కోల్పోయారు. కందిపప్పుకి, పెసర పప్పుకి తేడా తెలియని వ్యక్తి నారా లోకేష్‌. ఎవరి హయాంలో రైతులకు మేలు జరిగిందో బహిరంగ చర్చకు నేను సిద్ధం.. దమ్ముంటే చంద్రబాబు నాతో చర్చకు రావాలి. తేదీ, టైమ్‌, ప్లేస్‌ చెబితే వస్తాను. నా సవాల్‌ను చంద్రబాబు స్వీకరించాలి అని మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి వ్యాఖ్యానించారు. 

Back to Top