తాడేపల్లి: భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఎ.పి.జె.అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు నివాళి అర్పించారు. శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా సమాజంలోని ప్రతి వర్గాన్నీ ప్రభావితం చేసిన నాయకుడుగా డాక్టర్ కలాం సేవలను వైయస్ జగన్ గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో నివాళులర్పిస్తూ పోస్టు చేశారు. డా. ఎ.పి.జె. అబ్దుల్ కలాం ఒక శాస్త్రవేత్తగా, రాష్ట్రపతి అతని వినయం, దృష్టి, జ్ఞానం.. విద్య పట్ల అచంచలమైన అంకితభావం లక్షలాది మంది హృదయాలలో చెరగని ముద్ర వేసింది. కలాం గారి వారసత్వం మానవాళికి ఆశాజ్యోతిగా, తరతరాలకు స్ఫూర్తిగా కొనసాగుతోంది అంటూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.