‘మీడియా అంటే ఎందుకంత భయం?’

వైయ‌స్ఆర్‌సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్‌ కురసాల కన్నబాబు 
 

కాకినాడ:  ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కవరేజ్ కు వెళ్లిన సాక్షి టీవీతో పాటు కొన్ని ఇతర మీడియా చానెళ్లను అడ్డుకోవడంపై  ఉత్తరాంధ్ర జిల్లాల వైయ‌స్ఆర్‌సీపీ ఇంచార్జి కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు చంద్రబాబు ప్రభుత్వానికి ప్రశ్నించే మీడియా అంటే ఎందుకంత భయమని ప్రశ్నించారు. సోమ‌వారం కాకినాడ‌లో క‌న్న‌బాబు మీడియాతో మాట్లాడారు. ‘నోటీసులు ఇవ్వకుండా మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేయ‌డం లేదు.  ఆయ‌న కుమారుడు లోకేష్ రాసిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. వైయ‌స్ జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వనంటారు. కూటమిలో భాగస్వాములైన పార్టీకి పబ్లిక్ ఎకౌంట్స్ ఛైర్మన్ పదవి ఇస్తారు. చంద్రబాబుకు అనుకూల ఎల్లో మీడియా ఉన్నప్పుడు..ప్రశ్నించే మీడియా అంటే ఎందుకు భయం?, ఎంతకాలం మీడియా గొంతు నొక్కుతారు. చేతకాని అసమర్ధ ప్రభుత్వం అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు’ అని కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు.  

 
 

Back to Top