తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి రేపు పులివెందులకు వెళ్లనున్నారు. ఈ నెల 25, 26వ తేదీలు రెండు రోజుల పాటు వైయస్ జగన్ పులివెందులలో పర్యటించనున్నారు. 25వ తేదీ ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 11.45 గంటలకు పులివెందుల చేరుకుంటారు, స్ధానికంగా అందుబాటులో ఉంటారు. 26న ఉదయం 10 గంటలకు పులివెందుల గుంత బజార్ రోడ్డులో వైయస్‌ఆర్ ఫౌండేషన్, ఎల్ వి ప్రసాద్ ఐ ఇన్ట్సిట్యూట్ సంయుక్తంగా ఆధునీకరించిన అత్యాధునిక సౌకర్యాలతో కూడిన వైయస్ రాజారెడ్డి ఐ సెంటర్‌ను వైయస్ జగన్ ప్రారంభిస్తారు.