తాడేపల్లి: రాష్ట్రంలో చంద్రబాబు కంటే పెద్ద ఉన్మాది ఎవరూ లేరని, స్వార్థం కోసం ఎంతకైనా దిగజారడం చంద్రబాబు నైజం అయితే, ఈనాడు ఒక విషపత్రిక అని ఏపీ తెలుగు అకాడమీ మాజీ ఛైర్‌పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి అభివర్ణించారు. నాడు ఎన్టీఆర్‌ను గద్దె దింపడం మొదలు ఇప్పటి వరకు ఆ ఇద్దరి ఉన్మాదం రాష్ట్రానికి ఎంతో కీడు చేసిందని, నీచపు చంద్రబాబుకు ఎప్పటికైనా కాలమే బుద్ధి చెబుతుందని ఆమె స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంలో పాలకులు చేసిన పనికిమాలిన పనులను సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే, దేశద్రోహం చేసినట్లు ప్రభుత్వం అడ్డగోలుగా వందలాది మందిపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురి చేయడం ఉన్మాద చర్య కాదా?. అని ప్రశ్నించిన ఏపీ తెలుగు అకాడమీ మాజీ ఛైర్‌పర్సన్.. దాన్ని సమర్థిస్తూ, ఎల్లో మీడియా ఈనాడులో కధనం రాయడం, ఆ విష పత్రిక నైజాన్ని బయట పెట్టినట్లు కాదా? అని ఆమె నిలదీశారు. చంద్రబాబు వైఫల్యాలను ఎత్తి చూపితే ప్రజాద్రోహులుగా ముద్ర వేస్తారా అని మండిపడ్డారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఏపీ తెలుగు అకాడమీ మాజీ ఛైర్‌పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి మీడియాతో మాట్లాడారు. ఆ సంప్రదాయానికి ఐటీడీపీ నాంది: సోషల్ మీడియాలో మహిళలను కించపరిచేలా, అవమానించేలా పోస్టులు పెట్టే నీచమైన సంస్కృతిని ప్రోత్సహిస్తోంది టీడీïపీనే అన్న నందమూరి లక్ష్మీపార్వతి, ఏకంగా 3 లక్షల మందికి ఐటీడీపీలో ఉద్యోగాలిచ్చి, వారి ద్వారా రోజూ జగన్, ఆయన కుటుంబ సభ్యులు, వైయస్ఆర్‌సీపీ ముఖ్య నేతలపై దారుణ పోస్టులు వేయిస్తోంది మంత్రి నారా లోకేష్ అని ఆరోపించారు. ఐటీడీపీ చేస్తున్న నీచమైన, కక్షపూరిత పోస్టులకు తాళలేక అనేక మంది ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. దివంగత ఎన్టీఆర్ మొదలు ఇప్పుడు వైయస్ జగన్ వరకు చంద్రబాబు చేసిన నీచ రాజకీయాలు, పాపాలు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని చెప్పారు. చంద్రబాబులా ఎవరూ దిగజారలేదు: అవినీతికి పాల్పడిన అచ్చెన్నాయుడును అర్థరాత్రి అరెస్ట్ చేశారని ఆనాడు నానా యాగీ చేసిన చంద్రబాబు.. ఇప్పుడు వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై ఎక్కడికక్కడ కేసులు పెట్టి, చెప్పా పెట్టకుండా అర్థరాత్రుళ్లు అరెస్ట్ చేస్తున్నారని నందమూరి లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ జగన్‌పై శతృత్వం పెంచుకుని ఆయన్ను రాజకీయాల్లో ధైర్యంగా ఎదుర్కోలేక, పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారని ఆక్షేపించారు. దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇలా సామాజిక అరాచకాలను ప్రశ్నించే గొంతులను నొక్కుతూ, చంద్రబాబులా దిగజారి వ్యవహరించ లేదని గుర్తు చేశారు. షర్మిలది పచ్చి అవకాశవాదం రాష్ట్ర రాజకీయాల్లో షర్మిలది పచ్చి అవకాశవాదమని నందమూరి లక్ష్మీపార్వతి స్పష్టం చేశారు. ఒక సినీ హీరోతో సంబంధం అంటగడుతూ తన మీద వేసిన అభాండాలపై, షర్మిల ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని.. ఆ పోస్టులు చేసిన వారి అరెస్టు ఎందుకు కోరడం లేదని ్రçపశ్నించారు. షర్మిల ఆ పని చేసి ఉంటే బాగుండేదని అన్నారు. వాస్తవాలు మర్చి, నిజానిజాలు మాట్లాడకుండా షర్మిల పచ్చి అవకాశవాద నాయకురాలిగా మారారని గుర్తు చేశారు. రాజకీయాల్లో వైయస్ జగన్ ఏనాడూ అనైతికంగా వ్యవహరించలేదని, న్యాయమార్గాన్ని వీడలేదని స్పష్టం చేసిన నందమూరి లక్ష్మీపార్వతి, తన వారు ఇబ్బంది పడుతుంటే, ఆయన తప్పకుండా రక్షించుకుంటారని స్పష్టం చేశారు.