ఆక్సిజన్‌ వృథా కానివ్వొద్దు

ప్రభుత్వ ఆస్పత్రుల్లో రెమిడెసివర్‌ ఇంజక్షన్ల్‌ కొరత లేదు

కోవిడ్‌ ఫలితాలు 24 గంటల్లో వచ్చేలా చర్యలు

104కు కాల్‌ చేసిన మూడు గంటల్లో బెడ్‌ కేటాయించాలి

వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు మంత్రి ఆళ్ల నాని ఆదేశం

గుంటూరు: ప్రభుత్వ ఆస్పత్రుల్లో రెమిడెసివర్‌ ఇంజక్షన్ల కొరత లేదని, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కూడా ఇంజక్షన్‌ కొరత లేకుండా చూస్తామని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. గుంటూరు కలెక్టరేట్‌లో జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, హోంమంత్రి మేకతోటి సుచరిత సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్, కోవిడ్‌ బాధితులకు అందుతున్న వైద్యం, ఆక్సిజన్, ఆస్పత్రుల్లో బెడ్లు వంటి పలు అంశాలపై చర్చించారు. 

ఈ సందర్భంగా మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ.. ఆక్సిజన్‌ వృథా కాకుండా మెడికల్‌ ఆఫీసర్లు దృష్టిపెట్టాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రెమిడెసివర్‌ ఇంజక్షన్ల్‌ కొరత లేదని, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోనూ కొరత లేకుండా చూస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో కోవిడ్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు. 40 బెడ్స్‌ ఉన్న ఆస్పత్రులను కూడా కోవిడ్‌ సెంటర్లుగా అనుమతిస్తామని చెప్పారు. ప్రైమరీ కాంటాక్ట్‌ అందరికీ పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కోవిడ్‌ టెస్టుల ఫలితాలు 24 గంటల్లో వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 104కు కాల్‌ చేసిన మూడు గంటల్లో బెడ్‌ కేటాయించాలని ఆదేశించారు. 
 

Back to Top