ఆంధ్ర, తెలంగాణ మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు..! 

మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి
 
రాష్ట్రాల‌కు ప్రాధాన్యాలు వేరుగా ఉంటాయి

వైయ‌స్‌ జగన్ ఇచ్చిన హామీలు అమలును విశ్లేషించాలి

చంద్రబాబు రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారు..దీనిని గురించి ఎందుకు రాయడం లేదు..?

వ్యవసాయ యాంత్రీకరణ పై చర్చకు సిద్ధం :  మంత్రి కాకాణి సవాల్‌

చంద్రబాబు కమీషన్లు తీసుకున్నారని ప్రజలకు అర్థమైంది

నెల్లూరు:   ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాన్ని కొంతమంది పని కట్టుకుని చేస్తున్నారని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిప‌డ్డారు.  నెల్లూరులో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ఆ ప్రభుత్వ ప్రాధాన్యాలు.. ఆంధ్ర ఈ ప్రభుత్వ ప్రాధాన్యాలు వేరుగా ఉంటాయని.. దానిని పట్టించుకోకుండా ఇష్టానుసారం కొన్ని వార్తలు రాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు అమలు తీరు.. మన రాష్ట్రంలో వైయ‌స్‌ జగన్ ఇచ్చిన హామీలు అమలును విశ్లేషించాలని సూచించిన ఆయన.. చంద్రబాబు రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారని దుయ్యబట్టారు. దీనిని గురించి ఎందుకు రాయడం లేదు..? రాష్ట్రంలో కరువు మండలాలు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.. నాలుగేళ్లు బాగా వర్షాలు కురిశాయి.. ఈ ఏడాది ఇంకా వర్షాలకు సమయం ఉందన్నారు. చంద్రబాబు రాష్ట్రంలో తిరగడం వల్లే వర్షాలు రావడం లేదని ప్రజలు అంటున్నారని ఎద్దేవా చేసిన ఆయన.. ఇప్పుడు మళ్లీ వర్షాలు మొదలయ్యాయి.. ఆరు జిల్లాల్లో బాగా కురుస్తున్నాయన్నారు.

వ్యవసాయ యాంత్రీకరణ పై చర్చకు సిద్ధం అని సవాల్‌ చేశారు.. టీడీపీ హయాంలో కంపెనీలతో ముందస్తు ఒప్పందం కుదుర్చుకుని అక్రమాలకు పాల్పడ్డారని.. రైతులకు ఇచ్చే ట్రాక్టర్లలో సబ్సిడీని కూడా మింగారని ఆరోపించారు మంత్రి కాకాణి.. మా ప్రభుత్వ హయాంలో ఏది కొనాలో రైతులకే అవకాశం కల్పించామని స్పష్టం చేశారు. మరోవైపు.. కండలేరు హై లెవెల్ కెనాల్ కు సంబంధించి గ్రావిటీ తోనే నీళ్లు ఇస్తున్నాం.. టీడీపీ హయాంలో నీళ్లు అడుగంటి లిఫ్ట్ ద్వారా ఇచ్చారన్నారు. దమ్ముంటే వచ్చి చూడాలి అని సవాల్‌ చేసిన ఆయన.. సోమశిల జలాశయం పరిధిలోని రైతులను తీసుకు వచ్చి.. టీడీపీ నేతలు కలసి ధర్నా చేశారు.. లిఫ్ట్‌ పథకానికి కరెంట్ బిల్లు కింద రూ.3 కోట్ల 56 లక్షలు చెల్లించలేదని.. ఈ ప్రభుత్వ హయాంలో కోటి రూపాయలు బిల్లు అయ్యింది.. టిడిపి హయాంలో బిల్లు కట్టక పోవడంతో సర్ ఛార్జ్ కలవడంతో బిల్లు అధికంగా వచ్చింది.. ఈ విషయం చెప్పకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. పంటలకు ఇబ్బంది లేకుండా నీళ్లు ఇస్తున్నాం.. విద్యుత్ ఇబ్బంది లేకుండా బయట కొనుగోలు చేస్తున్నాం అని స్పష్టం చేశారు.

మరోవైపు.. చంద్రబాబుకు ఐటీ నోటీసులు ఇవ్వడాన్ని సాధారణమని అంటున్నారు అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు కాకాణి. రాజధాని పేరుతో తాత్కాలిక భవనాల పేరుతో సబ్ కాంట్రాక్టర్లకు పనులు ఇచ్చి ముడుపులు తీసుకున్నారు. కేంద్ర ఐటీ శాఖ ఇచ్చిన నోటీసులతోనే అవినీతి జరిగిందని నిర్ధారణ అయ్యిందన్నారు. చంద్రబాబు కమీషన్లు తీసుకున్నారని ప్రజలకు అర్థమైందన్న ఆయన.. ఇప్పుడు సమాధానం చెప్పలేక చంద్రబాబు కప్పిపుచ్చు కుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు కు వచ్చిన ముడుపులపై కేంద్ర సంస్థ అన్ని వివరాలతోనే నోటీసు ఇచ్చింది. చంద్రబాబు ఎవరెవరి వద్ద ఎంత తీసుకున్నారో అన్నీ బయటకు వస్తాయని.. మేం గతంలోనే ఈ విషయం పై ఆరోపణలు చేశాం.. ఇప్పుడవి నిజమయ్యాయని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Back to Top