అనంతపురం: తాటిచెర్ల సమీపంలో రైల్వే పట్టాలపై తోపుదుర్తి మహేష్ రెడ్డి అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటనకు తనకు ఎలాంటి సంబంధం లేదని వైయస్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు. టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ప్రకాశ్‌రెడ్డి ఈ ఘటనపై సీబీఐ విచారణకు సిద్ధమని సవాలు చేశారు. మహేశ్వరరెడ్డి వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారు. ఆయనకు ఆర్థిక ఇబ్బందులు, ప్రేమ వ్యవహారాలు ఉన్నాయని చెప్పారు. మహేష్ వాట్సాప్ స్టేటస్‌లో లవ్ ఫెయిల్యూర్ మెసేజ్‌లు ఉన్నాయని తెలిపారు. ఆయనకు పరిటాల శ్రీరామ్‌తో సత్సంబంధాలు ఉన్నాయి. అతన్ని వాడుకొని పరిటాల శ్రీరామ్ వదిలేశారని తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి మండిపడ్డారు.