చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడితే బుద్ధి చెబుతాం

మంగళగిరి, తాడికొండలో ఓడిపోయినా సిగ్గు రాలేదా?

వ్యక్తిగత విమర్శలు చేస్తే బట్టలూడదీసి కొడతాం

మంత్రి కొడాలి నాని

విజయవాడ: చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడితే బుద్ధి చెబుతామని మంత్రి కొడాలి నాని హెచ్చరించారు. రాజధానిలో దళితుల భూములను చంద్రబాబు దోచేశారని, ఇవాళ ఏ మొహం పెట్టుకొని ఆ ప్రాంతంలో పర్యటిస్తారని ప్రశ్నించారు. అందుకే వాళ్లంతా చంద్రబాబును నిలదీసే పరిస్థితి ఉందన్నారు. సార్వాత్రిక ఎన్నికల్లో చంద్రబాబును ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించారని తెలిపారు. చంద్రబాబు ఏ మొహం పెట్టుకొని రాజధానిలో తిరుగుతారని ప్రశ్నించారు. మంగళగిరి, తాడికొండలో ఓడిపోయినా సిగ్గు రాలేదన్నారు. తాను సీఎంగా ఉంటే ఊడబికేవాడిని, వైయస్‌ జగన్‌ ఏమి చేయడం లేదని చంద్రబాబు విమర్శలు చేయడం సరికాదన్నారు. చంద్రబాబు పెద్ద లుచ్చా, సన్యాసి, వెధవ అని, ఆయన సీఎం వైయస్‌ జగన్‌ను, వైయస్‌ఆర్‌ను, రాజారెడ్డిని విమర్శించే అర్హత ఆయనకు లేదన్నారు. సొల్లు కబుర్లు చెప్పుకుంటూ తిరుగుతున్నారని విమర్శించారు. చంద్రబాబుకు సిగ్గు,శరం లేదని దుయ్యబట్టారు.  చంద్రబాబు తన పెంపుడు కుక్కలను తనపై వదిలారని, పత్తిత్తు మాదిరిగా టీడీపీ నేతలు రోడ్డుపైకి వచ్చి మాట్లాడుతున్నారన్నారు. ఎన్‌టీఆర్‌ను హత్య చేసింది చంద్రబాబు కాదా అన్నారు. ఆ రోజు సీబీఐ విచారణ ఎందుకు వేయలేదని నిలదీశారు. ఇవాళ కడపకు వెళ్లి ఇష్టం వచ్చినట్లు చంద్రబాబు మాట్లాడుతున్నారని తప్పుపట్టారు. వైయస్‌ఆర్‌ కుటుంబ సభ్యులపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు. చంద్రబాబును రేపు రాజధాని ప్రాంతంలోని రైతులు, దళితులు నిలదీసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. హైదరాబాద్‌ రింగ్‌ రోడ్డు తానే కట్టినట్లు చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తే టీడీపీ నేతల బట్టలూడదీసి కొడతామని కొడాలి నాని హెచ్చరించారు. 

Read Also: పేదలందరికీ ఇళ్లు

Back to Top