పవన్‌ కళ్యాణ్‌ రెండు చోట్లా ఎందుకు ఓడిపోయారు

అలాంటి వాళ్లను పక్కన పెట్టుకొని పవన్‌ నీతులు మాట్లాడుతున్నారు

చంద్రబాబుది శాడిస్టు పాలన కాబట్టే జనం ఓడించారు

మంత్రి కొడాలి నాని

అమరావతి: పవన్‌ లాంగ్‌ మార్చ్‌ ఎందుకు చేశారో అర్థం కావడం లేదని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. వరదల్లో ఇసుక ఎలా తీస్తారో చెబుతారని ఎదురుచూశామని పేర్కొన్నారు. పవన్‌ ఎవరో ఇచ్చిన స్రిప్ట్‌ను కూడా సరిగా చదవలేకపోయారన్నారు. పవన్‌ వ్యాఖ్యలను చూసి జనం అసహ్యించుకుంటున్నారని చెప్పారు. కన్నబాబును నాగబాబు గెలిపించారని పవన్‌ అంటున్నారని, మరి నాగబాబును పవన్‌ ఎందుకు గెలిపించుకోలేకపోయారని ప్రశ్నించారు. పవన్‌ కళ్యాణ్‌ ఎందుకు రెండు చోట్ల ఓడిపోయారని మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. నాగావళి నదిలో అచ్చెన్నాయుడు బకాసుడిలా ఇసుకను మింగేశారని విమర్శించారు. నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడు రంగురాళ్లను దోచేశారని పేర్కొన్నారు. అలాంటి వాళ్లను పక్కన పెట్టుకొని పవన్‌ నీతులు చెబుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబుది శాడిస్టు పాలన కాబట్టే జనం ఓడించారని తెలిపారు.

Read Also: నాయకుడిగా ఎలా ఎదగాలో వైయస్‌ జగన్‌ను చూసి నేర్చుకో

Back to Top