అనాదిగా కొనసాగిన పెత్తందారీ వ్యవస్థకు చెక్‌ పెట్టిన నేత  వైయ‌స్ జగన్

శాసనమండలి సభ్యులు తోట త్రిమూర్తులు 

2019 తర్వాతే రాష్ట్రంలో సామాజిక న్యాయ పరిపాలనకు బీజాలు

సామాజిక న్యాయానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ శ్రీ వైఎస్‌ జగన్‌

కులం, మతం, రాజకీయం చూడని సంక్షేమ ప్రభుత్వమిది..

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్ని అక్కునజేర్చుకున్న మనసున్న ప్రభుత్వం

2024లోనూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వమే రావాలని ప్రజలు కోరుకుంటున్నారు

మండపేటలో అంబేద్కర్, జగ్జీవన్‌రామ్‌ విగ్రహాల ఏర్పాటు సంతోషకరం

జగనన్న ఆలోచన స్ఫూర్తితోనే ఇక్కడ పెత్తందార్లకు బుద్ధిచెప్పాం.

మండపేటలో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్, బాబూ జగ్జీవన్‌రామ్‌ విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో నియోజకవర్గ వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సమన్వయకర్త, శాసనమండలి సభ్యులు  తోట త్రిమూర్తులు 

 దళితవాడలకే పరిమితమైన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్, బాబూ జగ్జీవన్‌రామ్‌ గార్ల విగ్రహాల్ని ఈరోజు మండపేట నడిబొడ్డులోకి తెచ్చాం. గత ముప్పై నలభైఏళ్లుగా ఆ విగ్రహాలను ఒక పెత్తందారీ వ్యవస్థ దళిత వాడలకే పరిమితం చేసింది. వాటిని బయటకు తీసుకురావడానికి ఆ పెత్తందారీ వ్యవస్థ ఇన్నాళ్లూ ఒప్పుకోలేదు. గౌరవ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారి ఆశీస్సులతో నేను మండపేట నియోజకవర్గ సమన్వయకర్తగా వచ్చాక దళిత నేతలొచ్చి  నన్ను కలిశారు. అంబేద్కర్, జగ్జీవన్‌రామ్‌ల విగ్రహాలను మెయిన్‌ రోడ్డుమీదకు తీసుకురావాలని ఎన్నాళ్లుగానో తాము పోరాడుతున్నామని చెప్పారు. ఇందుకు పెత్తందార్ల అడ్డంకులే కారణమని చెప్పగానే.. నేను తక్షణమే స్పందించడం జరిగింది. సామాజిక న్యాయ పరిపాలనకు సారథిగా దమ్మున్న నాయకుని పరిపాలనలో దళిత నాయకుల కోరికను నేను నెరవేర్చాలనుకున్నాను. భారత రాజ్యాంగం అమల్లోకొచ్చి ఇన్నాళ్లైనా ఇంకా కొనసాగుతున్న కులవివక్షను నిర్మూలించాలనే ఉద్దేశంతో .. మున్సిపాల్టీలో తీర్మానం చేసి మరీ ఆ మహానుభావుల విగ్రహాల్ని ఇక్కడకు తెచ్చి నిలబెట్టుకోగలిగాం. బాధాకరమైన విషయమేమంటే, మున్సిపల్‌ ఎక్స్‌ అఫిషియో సభ్యునిగా స్వయంగా కౌన్సిల్‌ సమావేశానికి నేను హాజరై తీర్మానం చేయించే సమయంలో పెత్తందార్ల ప్రవర్తన చాలా విడ్డూరంగా నిలిచింది. అంబేద్కర్, జగ్జీవన్‌రామ్‌ మహనీయుల విగ్రహాలకు ప్రధాన కూడలిలో స్థలం ఇవ్వడానికి అంగీకరించని ఆ పెత్తందార్లు కౌన్సిల్‌లో ఆ మహనీయుల గురించి నాలుగు మాటలు మాట్లాడటానికీ సిద్ధపడలేదు. అయినప్పటికీ, దళితుల పక్షాన నిలిచిన ప్రభుత్వంలో వారు కోరినట్లు ఈరోజుకు అంబేద్కర్, జగ్జీవన్‌రామ్‌ల విగ్రహాలు మండపేట నడిబొడ్డుకు చేరడం చాలా సంతోషంగా ఉంది.  

వైయ‌స్ జగన్‌ గారి ఆలోచన స్ఫూర్తితో..
ప్రపంచంలోనే అత్యంత స్వేచ్ఛాయుతమైన రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్, జగ్జీవన్‌రామ్‌ వంటి గొప్ప వ్యక్తుల చరిత్రలు పుస్తకాలకే పరిమితం కావడానికి వీల్లేదు. అందుకే, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు ఇటీవల విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్‌ మహాశయుని ఎత్తైన విగ్రహాన్ని ఆవిష్కరణ చేసి రాజ్యాంగం, ప్రజాస్వామ్యం పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటుకున్నారు. సామాజిక న్యాయ పరిపాలనకు నాందిపలికిన జగనన్న ఆలోచన స్ఫూర్తితోనే నేను కూడా దేశ సామాజిక న్యాయచరిత్రలో ధృవతారల్లా నిలిచిన వీరి విగ్రహాలను మండపేట నడిబొడ్డుకు తీసుకురాగలిగాను. ఇలాంటి మహా వ్యక్తుల విగ్రహాలు ప్రతీ పట్టణ ప్రధాన కూడళ్లులో ఉన్నట్లైతే.. భవిష్యత్‌ తరాలు వస్తూపోతూ వారి గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. 

2019 తర్వాతే సామాజిక న్యాయానికి బీజాలుః
రాష్ట్రంలో నేడు కొనసాగుతోన్న సామాజిక న్యాయ ప్రభుత్వ పాలనకు నాందిపలికిన వ్యక్తి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే. 2019 ఎన్నికల తర్వాతనే ఆయన ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టాకనే సామాజిక న్యాయ పాలనకు బీజం పడిందనేది జగమెరిగిన సత్యం. అనాదిగా కొనసాగిన పెత్తందారీ వ్యవస్థకు చెక్‌ పెట్టి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణ నిరుపేదలను అక్కున జేర్చుకుని వారి సంక్షేమానికి పాటుపడిన మనసున్న నేత జగన్‌ గారు. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబాటులో ఉన్న వర్గాలన్నింటినీ ఒక పక్కా ప్రణాళికతో పైస్థాయికి తెచ్చిన ఆదర్శ పాలకుడు జగన్‌ గారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ ఆయా వర్గాలకు ఆర్థికదన్ను కల్పించి సామాజికంగా, రాజకీయంగా వారికి  అవకాశమున్న ప్రతీచోటా  గుర్తింపునిచ్చిన మహనీయుడు మన జగనన్న. కాబట్టే.. వాడవాడలా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీ సోదరులంతా జగనన్నకు నీరాజనాలు పలుకుతూ.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని దీవిస్తున్నారు. 

పరిపాలనకు బ్రాండ్‌ అంబాసిడర్‌ జగన్‌గారు
అధికారంలోకి రాకముందు ఇచ్చిన వాగ్దానాలను అధికారంలోకొచ్చాక వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా మరిచిపోయే నాయకుల్ని గతంలో చూశాం. ఎవరైనా బాధితులు ప్రభుత్వ సాయం కోరి అలాంటి నాయకుల్ని అడిగినప్పుడు.. ‘నువ్వు నాకు ఓటేశావా..? నువ్వు ఏ పార్టీ..? నీ కులమేంటి..?’ అని ఆరాతీసి మరీ స్పందించిన తీరు చూశాం. అయితే, మన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక జగన్‌మోహన్‌రెడ్డి గారి పాలనలో కులం చూడ్లేదు. మతం చూడ్లేదు. రాజకీయ పార్టీని చూడ్లేదు. బాధితులుగా మగ్గిపోతున్న వారి పేదరికాన్నే చూసి స్పందించిన సామాజిక న్యాయ మార్గదర్శి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గారని మనం గర్వంగా చెప్పుకోవాలి. మొన్న నాకు ఓటేశావా..? రేపు నాకు ఓటేస్తావా..? అని ఆయన ఎవరినీ అడగడంలేదు. ఐదేళ్ల పరిపాలనలో మీకు మంచి జరిగితేనే ఓటేయండని .. మంచి ప్రభుత్వం గురించి పదిమందికి చెప్పండని అడుగుతున్న దమ్మున నేత ఆయన. దేశంలోని మిగతా రాష్ట్రాలన్నీ ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతోన్న ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాల్నే ఆదర్శంగా  తీసుకుంటున్నారంటే.. పరిపాలనకు మన జగనన్నను బ్రాండ్‌ అంబాసిడర్‌గా చెప్పుకోవాలి. 

Back to Top